Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

గురువారం, జులై 22, 2021

ఎనుబదవ పద్యము: శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము [గర్భకవిత్వము]

ఓం నమో భగవతే వాసుదేవాయ

శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]


ఎనుబదవ పద్యము:

చంపకమాల:
వర! తగ నెన్నఁగా, భృగువు బ్రహ్మఁ గపర్దిఁ బరీక్ష సేసి, య
ప్డరసియుఁ దా నినుం గదిసి, యబ్ధి శయించుటఁ గాంచి, మౌనియే
త్వర జగదీశ! నీ యురముఁ దన్నఁగఁ, బాదము నొత్తినావె జ్ఞా
న రమ నిడన్! హరీ! ఘన ప్రణామము లందితె గణ్య! కేశవా! 80

గర్భిత కందము:
తగ నెన్నఁగా, భృగువు బ్ర
హ్మఁ గపర్దిఁ బరీక్ష సేసి, యప్డరసియుఁ దా
జగదీశ! నీ యురముఁ ద
న్నఁగఁ, బాదము నొత్తినావె జ్ఞాన రమ నిడన్! 80

గర్భిత తేటగీతి:
భృగువు బ్రహ్మఁ గపర్దిఁ బరీక్ష సేసి,
కదిసి, యబ్ధి శయించుటఁ గాంచి, మౌని,
యురముఁ దన్నఁగఁ, బాదము నొత్తినావె!
ఘన ప్రణామము లందితె గణ్య! కేశ! 80



స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి