Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ఆదివారం, జులై 18, 2021

డెబ్బదినాలుఁగవ పద్యము: శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము [గర్భకవిత్వము]

ఓం నమో భగవతే వాసుదేవాయ

శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]


డెబ్బదినాలుఁగవ పద్యము:

చంపకమాల:
అదె, చెలి దుస్స్థితిన్, ఖరుఁడు, నా ఖల దూషణ కర్వరుండుఁ గ
న్నదరులతోఁ గడుం గినుక నందియుఁ, గైదువుఁ గేలఁ దాల్ప, నీ
వదె చెలఁగన్, వెసం గపిరథా! తిలకించి, పొకాల్చి, చంపితే
విధి బలిమిన్! సురల్, మునులఁ బ్రీతినిఁ దేల్చితె! పూజ్య! కేశవా! 74

గర్భిత కందము:
చెలి దుస్స్థితిన్, ఖరుఁడు, నా
ఖల దూషణ కర్వరుండుఁ గన్నదరులతోఁ
జెలఁగన్, వెసం గపిరథా!
తిలకించి, పొకాల్చి, చంపితే విధి బలిమిన్! 74

గర్భిత తేటగీతి:
ఖరుఁడు, నా ఖల దూషణ కర్వరుండుఁ
గినుక నందియుఁ, గైదువుఁ గేలఁ దాల్పఁ,
గపిరథా! తిలకించి, పొకాల్చి, చంపి,
మునులఁ బ్రీతినిఁ దేల్చితె! పూజ్య! కేశ! 74



స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి