[నా చిన్నతనంలో నేను దేవుణ్ణి చూపించమంటూ మారాం చేస్తుంటే... నాన్న నన్ను తన భుజంపై కెక్కించుకొని ఆకాశంలోకి చూపించాడు. నేను దేనినో చూచి దేవుడని భ్రమించి అప్పటికి మారాం ఆపాను. కాని, ఆ దేవుని భుజాలపైననే నేనున్నానని ఆనాడు తెలుసుకోలేకపోయాను. తెలుసుకొనేసరికి ఆ దేవుడే నాకు దూరమయ్యాడు]
"దేవుండెచ్చట నుండెను?
దేవునిఁ జూపింపు" మనఁగ, ♦ దివముం జూపన్;
దేవునిఁ గన భుజమెక్కియు
దేవుండగు నా జనకుని ♦ దిగువఁ గననహో!
ఇదియే భావము తేటగీతిలో...
తే.గీ.
దేవుఁ డెక్కడ నుండెనో ♦ తెలియఁ జెప్పు
తే.గీ.
దేవుఁ డెక్కడ నుండెనో ♦ తెలియఁ జెప్పు
మనఁగ నా తండ్రి దివిఁ జూపె; ♦ నపుడు చూడ,
నాదు తండ్రి భుజ మ్మెక్కి♦నట్టి నేను
తండ్రియే దేవుఁడని నాఁడు ♦ తలఁచనైతి!
-:శుభం భూయాత్:-
పితృదేవో భవ.
రిప్లయితొలగించండితండ్రిని గూర్చిన పద్యములు బాగున్నాయి సర్.
అభినందనలు.
అంబటి భానుప్రకాశ్.
తండ్రిని గురించిన మీ యభిప్రాయము తెలుపుటతో పాటు, పద్యములను పరామర్శించినందులకు ధన్యవాదములు భాను గారూ!
తొలగించండిప్రత్యక్షదైవాలు....తల్లిదండ్రులే గదా!
రిప్లయితొలగించండిపిల్లలుగా ఉన్నప్పుడు తెలియదు. తాము పెద్దవాళ్ళయింతర్వాత తెలుస్తుంది. కాని తెలిసే నాటికే వారు స్వర్గస్థులైతే...ఆ బాధ వర్ణనాతీతం. నా విషయంలో ఇదే జరిగింది. నా ప్రయోజకత్వాన్ని మా తండ్రిగారు చూడకుండానే స్వర్గస్థులయ్యారు.
తొలగించండిప్రత్యక్షదైవాలు....తల్లిదండ్రులే గదా!
రిప్లయితొలగించండిస్పందించినందులకు ధన్యవాదాలు శిష్ట్లావారూ! _/\_
తొలగించండిమీరు సార్థక జన్ములు....మీ తండ్రిగారు మీ ప్రతిభకు నిరంతరం సంతోషిస్తుంటారు....చాలా బాధ కలిగింది
తొలగించండిమీరు సార్థక జన్ములు....మీ తండ్రిగారు మీ ప్రతిభకు నిరంతరం సంతోషిస్తుంటారు....చాలా బాధ కలిగింది
తొలగించండిధన్యవాదాలండీ శిష్ట్లా వారూ! _/\_ _/\_ _/\_
తొలగించండి