Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శనివారం, జులై 31, 2021

తొంబదిరెండవ పద్యము: శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము [గర్భకవిత్వము]

ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]


తొంబదిరెండవ పద్యము:

చంపకమాల:
హిత! ఖగవాహనా! క్రమత నింపగు భక్తిని రామదాసు ప
న్ని, తనరుచున్ గడున్ రమణ, నీపయిఁ గీర్తనలన్ రచించి, స
ద్వ్రత! నిగమోన్నతా! కదలి, భద్రగిరిన్ గుడిఁ గట్ట నీకుఁ, బ్రా
జ్ఞ! తరలవే! హరీ! యెలమిఁ గావవె మోక్షము నిచ్చి! కేశవా! 92

గర్భిత కందము:
ఖగవాహనా! క్రమత నిం
పగు భక్తిని రామదాసు పన్ని, తనరుచున్
నిగమోన్నతా! కదలి, భ
ద్రగిరిన్ గుడిఁ గట్ట నీకుఁ, బ్రాజ్ఞ! తరలవే! 92

గర్భిత తేటగీతి:
క్రమత నింపగు భక్తిని రామదాసు,
రమణ, నీపయిఁ గీర్తనలన్ రచించి,
కదలి, భద్రగిరిన్ గుడిఁ గట్ట నీకు!
నెలమిఁ గావవె మోక్షము నిచ్చి! కేశ! 92



స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు

శుక్రవారం, జులై 30, 2021

తొంబదియొకటవ పద్యము: శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము [గర్భకవిత్వము]

ఓం నమో భగవతే వాసుదేవాయ

శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]


తొంబదియొకటవ పద్యము:

చంపకమాల:
అదె దయఁ బూని, నీ వమరఁ, ద్యాగయ కీర్తన లందు నిల్చి, కాం
చెదె యెలమిన్! హరీ! సరగ, "శ్రీవరు సన్నిధి సౌఖ్య" మన్న, మె
చ్చెదె! జయ రాఘవా! వఱలి, చిజ్జయ మిచ్చెదె! పద్మనాభ! స
త్పద మిడియున్, క్షితిం గృతుల భక్తిని నీన్ బులకింతె, కేశవా! 91

గర్భిత కందము:
దయఁ బూని, నీ వమరఁ, ద్యా
గయ కీర్తన లందు నిల్చి, కాంచెదె యెలమిన్!
జయ రాఘవా! వఱలి, చి
జ్జయ మిచ్చెదె! పద్మనాభ! సత్పద మిడియున్! 91

గర్భిత తేటగీతి:
అమరఁ, ద్యాగయ కీర్తన లందు నిల్చి,
సరగ, "శ్రీవరు సన్నిధి సౌఖ్య" మన్న,
వఱలి, చిజ్జయ మిచ్చెదె! పద్మనాభ!
కృతుల భక్తిని నీన్ బులకింతె, కేశ! 91



స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు

గురువారం, జులై 29, 2021

తొంబదవ పద్యము: శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము [గర్భకవిత్వము]

ఓం నమో భగవతే వాసుదేవాయ

శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]


తొంబదవ పద్యము:

ఉత్పలమాల:
ఓ యవనారి! నీ వఘసముద్భవనాశకమౌ పథమ్ముఁ, బా
రాయణకై తగం బరమ రమ్యమునౌ ఘనభాగ్యరాశి న
య్యా! యవతారకా! భువిని నౌర! వెలార్చితె మొల్ల సేఁత రా
మాయణమున్! హరీ రచన మాదృతిఁ దేర్చితె! ప్రాజ్ఞ! కేశవా! 90

గర్భిత కందము:
యవనారి! నీ వఘసము
ద్భవనాశకమౌ పథమ్ముఁ, బారాయణకై
యవతారకా! భువిని నౌ
ర! వెలార్చితె మొల్ల సేఁత రామాయణమున్! 90

గర్భిత తేటగీతి:
అఘసముద్భవనాశకమౌ పథమ్ముఁ,
బరమ రమ్యమునౌ ఘనభాగ్యరాశి,
భువిని నౌర! వెలార్చితె మొల్ల సేఁత!
రచన మాదృతిఁ దేర్చితె! ప్రాజ్ఞ! కేశ! 90




స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు

బుధవారం, జులై 28, 2021

ఎనుబదితొమ్మిదవ పద్యము: శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము [గర్భకవిత్వము]

ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]


ఎనుబదితొమ్మిదవ పద్యము:

చంపకమాల:
ధ్రువ! ఘన! రాఘవా! యలరఁ దోచిన భాగవతాప్తిఁ గోరి, శ్రీ
ధవ! మదిలోఁ, గడుం దడవి, దానిని భక్తియుతమ్ముగాను, నీ
భువిఁ దనరన్, హరీ! పరఁగఁ బోతనచేఁ దగ వ్రాయఁజేసి, దా
న వెలిఁగితే, క్షితిన్ వఱలి, నమ్మికఁ బెంచితె భక్తిఁ గేశవా! 89

గర్భిత కందము:
ఘన! రాఘవా! యలరఁ దో
చిన భాగవతాప్తిఁ గోరి, శ్రీధవ! మదిలోఁ,
దనరన్, హరీ! పరఁగఁ బో
తనచేఁ దగ వ్రాయఁజేసి, దాన వెలిఁగితే! 89

గర్భిత తేటగీతి:
అలరఁ దోచిన భాగవతాప్తిఁ గోరి,
తడవి, దానిని భక్తియుతమ్ముగాను,
పరఁగఁ బోతనచేఁ దగ వ్రాయఁజేసి,
వఱలి, నమ్మికఁ బెంచితె భక్తిఁ గేశ! 89



స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు

మంగళవారం, జులై 27, 2021

ఎనుబదియెనిమిదవ పద్యము: శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము [గర్భకవిత్వము]

ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]


ఎనుబదియెనిమిదవ పద్యము:

చంపకమాల:
మన, జగదీశ్వరా! పరఁగ మామ, గజమ్మునుఁ బంపఁగాను, మా
ర్పనుఁ జనియుం, గడున్ ఘన దురమ్మున, సింహ విఘాత రీతి, ది
గ్గనఁ దగఁ గ్రుమ్మియున్ సరగఁ గంసు గజమ్మునుఁ జంపినావె, జో
రునఁ బొగడన్, హరీ! వెలిఁగి, రుండికఁ జేరవె! వృష్ణి! కేశవా! 88

గర్భిత కందము:
జగదీశ్వరా! పరఁగ మా
మ, గజమ్మునుఁ బంపఁగాను, మార్పనుఁ జనియున్,
దగఁ గ్రుమ్మియున్ సరగఁ గం
సు గజమ్మునుఁ జంపినావె, జోరునఁ బొగడన్! 88

గర్భిత తేటగీతి:
పరఁగ మామ, గజమ్మునుఁ బంపఁగాను,
ఘన దురమ్మున, సింహ విఘాత రీతి,
సరగఁ గంసు గజమ్మునుఁ జంపినావె!
వెలిఁగి, రుండికఁ జేరవె! వృష్ణి! కేశ! 88



స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు

ఆదివారం, జులై 25, 2021

ఎనుబదియేడవ పద్యము: శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము [గర్భకవిత్వము]

ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]


ఎనుబదియేడవ పద్యము:

చంపకమాల:
కల మెయిఁ బిన్నటన్ జదల కాన్కయునౌ శశి, రామచంద్ర! కా
వలెననుచో, వెసన్ దరికి వచ్చియు, మంత్రి సుమంత్రుఁ డప్డుఁ దా
నల, పయిఁ జంద్రునే, యహహ! యమ్మెయి నద్దము నందుఁ జూపి, మె
ప్పులఁ గొనఁడే! హరీ! మదినిఁ బూర్తిగఁ గెల్వఁడె! మాన్య! కేశవా! 87

గర్భిత కందము:
మెయిఁ బిన్నటం, జదల కా
న్కయునౌ శశి, రామచంద్ర! కావలెననుచోఁ
బయిఁ జంద్రునే యహహ! య
మ్మెయి నద్దము నందుఁ జూపి, మెప్పులఁ గొనఁడే! 87

గర్భిత తేటగీతి:
చదల కాన్కయునౌ శశి, రామచంద్ర!
దరికి వచ్చియు, మంత్రి సుమంత్రుఁ డప్డు,
నహహ! యమ్మెయి నద్దము నందుఁ జూపి,
మదినిఁ బూర్తిగఁ గెల్వఁడె! మాన్య! కేశ! 87



స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు

ఎనుబదియాఱవ పద్యము: శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము [గర్భకవిత్వము]

ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]


ఎనుబదియాఱవ పద్యము:

చంపకమాల:
కృత వర గర్వియై కనల, ఖేచరులే కని కాలనేమి, సం
తత భయులై, కడున్ జెదరి, నమ్మియు వే నినుఁ జేరి, పొంద నా
ర్ద్రతఁ, ద్వర నంద నీ శరణు, తార్క్ష్యరథా! ఖలుఁ, జక్ర మేసి, చం
పి, తనరితే! హరీ! తునిమి, మెప్పుల నందితె తుష్టిఁ గేశవా! 86

గర్భిత కందము:
వర గర్వియై కనల, ఖే
చరులే కని కాలనేమి, సంతత భయులై,
త్వర నంద నీ శరణు, తా
ర్క్ష్యరథా! ఖలుఁ, జక్ర మేసి, చంపి, తనరితే! 86

గర్భిత తేటగీతి:
కనల, ఖేచరులే కని కాలనేమిఁ,
జెదరి, నమ్మియు వే నినుఁ జేరి, పొంద
శరణు, తార్క్ష్యరథా! ఖలుఁ, జక్ర మేసి,
తునిమి, మెప్పుల నందితె తుష్టిఁ గేశ! 86



స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు

శనివారం, జులై 24, 2021

ఎనుబదియైదవ పద్యము: శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము [గర్భకవిత్వము]

ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]


ఎనుబదియైదవ పద్యము:

చంపకమాల:
ధ్రువ! భువి నాశియై చెలఁగు ధుంధువుఁ జెచ్చెరఁ ద్రెళ్ళఁజేయ, నూ
త్న విభలతో, హరీ! సువదనా! కువలాశ్వునిఁ జొచ్చి, యీవు మా
ధవ! రవళించుచున్, నియతి దానవుఁ జంపఁగ, నిర్జరాళి న
ప్పి వొగడరే! కనన్ జనులు ప్రీతిని నొందరె! శార్ఙ్గి! కేశవా! 85

గర్భిత కందము:
భువి నాశియై చెలఁగు ధుం
ధువుఁ జెచ్చెరఁ ద్రెళ్ళఁజేయ, నూత్న విభలతో
రవళించుచున్, నియతి దా
నవుఁ జంపఁగ, నిర్జరాళి నప్పి, వొగడరే! 85

గర్భిత తేటగీతి:
చెలఁగు ధుంధువుఁ జెచ్చెరఁ ద్రెళ్ళఁజేయ,
సువదనా! కువలాశ్వునిఁ జొచ్చి, యీవు
నియతి దానవుఁ జంపఁగ, నిర్జరాళి,
జనులు ప్రీతిని నొందరె! శార్ఙ్గి! కేశ! 85



స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు

ఎనుబదినాలుఁగవ పద్యము: శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము [గర్భకవిత్వము]

ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]


ఎనుబదినాలుఁగవ పద్యము:

చంపకమాల:
క్రతు! నిగమోన్నతా! యజగరమ్ముగ మాఱి యఘాసురుండు, భూ
నుత! కనుచున్, నినుం బసులనుం బశుపాలురఁ బట్టి, వేగ, సూ
నృత! జగదీశ్వరా! మెఱసి, మ్రింగఁగ, గొంతున మేనుఁ బెంచి, క
న్న! తునిమితే! హరీ! సఖుల నచ్చికఁ  గాచితె! శౌరి! కేశవా! 84

గర్భిత కందము:
నిగమోన్నతా! యజగర
మ్ముగ మాఱి యఘాసురుండు, భూనుత! కనుచున్,
జగదీశ్వరా! మెఱసి, మ్రిం
గఁగ, గొంతున మేనుఁ బెంచి, కన్న! తునిమితే! 84

గర్భిత తేటగీతి:
అజగరమ్ముగ మాఱి యఘాసురుండు,
పసులనుం బశుపాలురఁ బట్టి, వేగ,
మెఱసి, మ్రింగఁగ, గొంతున మేనుఁ బెంచి,
సఖుల నచ్చికఁ  గాచితె! శౌరి! కేశ! 84



స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు

శుక్రవారం, జులై 23, 2021

ఎనుబదిమూఁడవ పద్యము: శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము [గర్భకవిత్వము]

ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]


ఎనుబదిమూఁడవ పద్యము:

ఉత్పలమాల:
శ్రీ లలితాత్మకా! పఱపి ప్రేక్షల, నాస్తిక వాద మూన జా
బాలియె, నీ నుడుల్ పలికి, స్వాంతముఁ దెల్పియుఁ, బ్రాఙ్మతాప్తి రా
మా! లలి వాదముల్ నెఱపి, మాన్యుల యాస్తిక నేతవయ్యునుం
దేలితివే! హరీ! పృథివిఁ దేర్చితె ధార్మిక రీతిఁ గేశవా! 83

గర్భిత కందము:
లలితాత్మకా! పఱపి ప్రే
క్షల, నాస్తిక వాద మూన జాబాలియె, నీ
లలి వాదముల్ నెఱపి, మా
న్యుల యాస్తిక నేతవయ్యునుం దేలితివే! 83

గర్భిత తేటగీతి:
పఱపి ప్రేక్షల, నాస్తిక వాద మూనఁ,
బలికి, స్వాంతముఁ దెల్పియుఁ, బ్రాఙ్మతాప్తి
నెఱపి, మాన్యుల యాస్తిక నేతవయ్యుఁ
బృథివిఁ దేర్చితె ధార్మిక రీతిఁ గేశ! 83



స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు

ఎనుబదిరెండవ పద్యము: శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము [గర్భకవిత్వము]

ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]


ఎనుబదిరెండవ పద్యము:

చంపకమాల:
వనిఁ జని, గొల్లలుం బసుల పాలనఁ జేయఁగఁ, బంబు జ్వాలలం
గని, యడల, న్వెస న్వెడలి, గ్రక్కున నార్పఁగ నిశ్చయించి, గొ
బ్బున జనరక్షకై, పరఁగఁ బ్లుక్షినిఁ ద్రావితె వాసుదేవ! జీ
వన మిడితే! హరీ! సఖుల వందన మందితె! శౌరి! కేశవా! 82

గర్భిత కందము:
చని, గొల్లలుం బసుల పా
లనఁ జేయఁగఁ, బంబు జ్వాలలం గని, యడలన్,
జనరక్షకై, పరఁగఁ బ్లు
క్షినిఁ ద్రావితె వాసుదేవ! జీవన మిడితే! 82

గర్భిత తేటగీతి:
పసుల పాలనఁ జేయఁగఁ, బంబు జ్వాల,
వెడలి, గ్రక్కున నార్పఁగఁ బ్రీతిఁ బూని,
పరఁగఁ బ్లుక్షినిఁ ద్రావితె వాసుదేవ!
సఖుల వందన మందితె! శౌరి! కేశ! 82



స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు

గురువారం, జులై 22, 2021

ఎనుబదియొకటవ పద్యము: శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము [గర్భకవిత్వము]

ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]


ఎనుబదియొకటవ పద్యము:

చంపకమాల:
భువిఁ గన, రాఘవా! పొడనుఁ బొందిన ధర్మమె పొల్చినట్లు నీ
వవు నడతల్ గడున్ జనుల కచ్చు వడంగఁ, బ్రశంసలంది, యో
ధ్రువ! దనుజాళినిం జెలఁగ, దుష్టునిఁ ద్రుంచియు, శిష్టు నోమి, క్షో
ణి వఱలితే! హరీ! త్రి వ్రత నిష్ఠను వెల్గితె ప్రీతిఁ గేశవా! 81

గర్భిత కందము:
కన, రాఘవా! పొడనుఁ బొం
దిన ధర్మమె పొల్చినట్లు నీవవు నడతల్
దనుజాళినిం జెలఁగ, దు
ష్టునిఁ ద్రుంచియు, శిష్టు నోమి, క్షోణి వఱలితే! 81

గర్భిత తేటగీతి:
పొడనుఁ బొందిన ధర్మమె పొల్చినట్లు,
జనుల కచ్చు వడంగఁ, బ్రశంసలంది,
చెలఁగ దుష్టునిఁ ద్రుంచియు, శిష్టు నోమి,
త్రి వ్రత నిష్ఠను వెల్గితె ప్రీతిఁ గేశ! 81



స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు

ఎనుబదవ పద్యము: శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము [గర్భకవిత్వము]

ఓం నమో భగవతే వాసుదేవాయ

శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]


ఎనుబదవ పద్యము:

చంపకమాల:
వర! తగ నెన్నఁగా, భృగువు బ్రహ్మఁ గపర్దిఁ బరీక్ష సేసి, య
ప్డరసియుఁ దా నినుం గదిసి, యబ్ధి శయించుటఁ గాంచి, మౌనియే
త్వర జగదీశ! నీ యురముఁ దన్నఁగఁ, బాదము నొత్తినావె జ్ఞా
న రమ నిడన్! హరీ! ఘన ప్రణామము లందితె గణ్య! కేశవా! 80

గర్భిత కందము:
తగ నెన్నఁగా, భృగువు బ్ర
హ్మఁ గపర్దిఁ బరీక్ష సేసి, యప్డరసియుఁ దా
జగదీశ! నీ యురముఁ ద
న్నఁగఁ, బాదము నొత్తినావె జ్ఞాన రమ నిడన్! 80

గర్భిత తేటగీతి:
భృగువు బ్రహ్మఁ గపర్దిఁ బరీక్ష సేసి,
కదిసి, యబ్ధి శయించుటఁ గాంచి, మౌని,
యురముఁ దన్నఁగఁ, బాదము నొత్తినావె!
ఘన ప్రణామము లందితె గణ్య! కేశ! 80



స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు

డెబ్బదితొమ్మిదవ పద్యము: శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము [గర్భకవిత్వము]

ఓం నమో భగవతే వాసుదేవాయ

శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]


డెబ్బదితొమ్మిదవ పద్యము:

చంపకమాల:
కొని మరణాంత్య దుర్నియతిఁ, గొక్కెర రక్కసి నిన్ను మ్రింగఁ, గీ
ల్కొని కుతుకన్ గడున్ జ్వలతఁ గూర్చితె! మండఁగ, వాఁడు వేఁగి, గ్ర
క్కున హరి! నిన్నుఁ దాఁ బొసఁగఁ గ్రుమ్మరి క్రక్కఁగ, ముక్కుఁ జీల్చి, మ్రం
ద నుఱిమితే! వెసన్ స్మయ మొనర్చితె చూడ్కికి! శౌరి! కేశవా! 79

గర్భిత కందము:
మరణాంత్య దుర్నియతిఁ, గొ
క్కెర రక్కసి నిన్ను మ్రింగఁ, గీల్కొని కుతుకన్,
హరి! నిన్నుఁ దాఁ బొసఁగఁ గ్రు
మ్మరి క్రక్కఁగ, ముక్కుఁ జీల్చి, మ్రంద నుఱిమితే! 79

గర్భిత తేటగీతి:
నియతిఁ, గొక్కెర రక్కసి నిన్ను మ్రింగఁ,
జ్వలతఁ గూర్చితె! మండఁగ, వాఁడు వేఁగి,
పొసఁగఁ గ్రుమ్మరి క్రక్కఁగ, ముక్కుఁ జీల్చి,
స్మయ మొనర్చితె చూడ్కికి! శౌరి! కేశ! 79



స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు

మంగళవారం, జులై 20, 2021

డెబ్బదియెనిమిదవ పద్యము: శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము [గర్భకవిత్వము]

ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]


డెబ్బదియెనిమిదవ పద్యము:

చంపకమాల:
కపి! దనుజద్విషా! పొలువ, కాక నిశాటుఁడు, భూజ నేఁచఁ, గాం
చి, పరువడిన్, హరీ! నృపతి శేఖర! వాని వధింప నెంచి, య
జ్ఞప! మనుజాధిపా! కుశ మజాస్త్ర నిమంత్రణఁ గోరి, యక్షి రా
లిపితె దయన్, వెసన్ బరిహరించితె వేఁడ, శుభాంగ! కేశవా! 78

గర్భిత కందము:
దనుజద్విషా! పొలువ, కా
క నిశాటుఁడు, భూజ నేఁచఁ, గాంచి, పరువడిన్,
మనుజాధిపా! కుశ మజా
స్త్ర నిమంత్రణఁ గోరి, యక్షి రాలిపితె దయన్! 78

గర్భిత తేటగీతి:
పొలువ కాక నిశాటుఁడు, భూజ నేఁచఁ,
నృపతి శేఖర! వాని వధింప నెంచి,
కుశ మజాస్త్ర నిమంత్రణఁ గోరి, యక్షిఁ,
బరిహరించితె వేఁడ, శుభాంగ! కేశ! 78



స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు

డెబ్బదియేడవ పద్యము: శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము [గర్భకవిత్వము]

ఓం నమో భగవతే వాసుదేవాయ

శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]


డెబ్బదియేడవ పద్యము:

చంపకమాల:
ధ్రువ! శ్రితరక్షకా! క్రుధను ద్రోణ తనూజుఁడు గూర్చినట్టి నా
శ వృత కృతిన్ వెసన్ హత మసహ్య మపాండవ మాఁపఁగాను మా
ధవ! మతి నెంచియున్ ఋజు యుతాంచిత చర్యఁ బరీక్షితాఖ్యు చి
ద్భవమిడితే! తగన్ నిలిపి, వంశముఁ బెంచితె! నిత్య! కేశవా! 77

గర్భిత కందము:
శ్రితరక్షకా! క్రుధను ద్రో
ణ తనూజుఁడు గూర్చినట్టి నాశ వృత కృతిన్
మతి నెంచియున్ ఋజు యుతాం
చిత చర్యఁ బరీక్షితాఖ్యు చిద్భవమిడితే! 77

గర్భిత తేటగీతి:
క్రుధను ద్రోణ తనూజుఁడు గూర్చినట్టి
హత మసహ్య మపాండవ మాఁపఁగాను
ఋజు యుతాంచిత చర్యఁ బరీక్షితాఖ్యు
నిలిపి, వంశముఁ బెంచితె! నిత్య! కేశ! 77



స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు

సోమవారం, జులై 19, 2021

డెబ్బదియాఱవ పద్యము: శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము [గర్భకవిత్వము]

ఓం నమో భగవతే వాసుదేవాయ

శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]


డెబ్బదియాఱవ పద్యము:

చంపకమాల:
జన గుణపోషకా! ప్రణవ! సద్గుణ షోడశ! రాఘవాఖ్య! కూ
ర్మిని నిలలో హరీ! యతుల రీతిని రామకథామృతమ్ము ని
మ్మున గణియించుచున్ మునియె ప్రోద్గుణి వాల్మికి పూని వ్రాసి, భూ
ర్ణిని నిలిపెన్! దివిన్ ముని విరించులఁ బ్రీతిని ముంచెఁ గేశవా! 76

గర్భిత కందము:
గుణపోషకా! ప్రణవ! స
ద్గుణ షోడశ! రాఘవాఖ్య! కూర్మిని నిలలో
గణియించుచున్ మునియె ప్రో
ద్గుణి వాల్మికి పూని వ్రాసి, భూర్ణిని నిలిపెన్! 76

గర్భిత తేటగీతి:
ప్రణవ! సద్గుణ షోడశ! రాఘవాఖ్య!
యతుల రీతిని రామకథామృతమ్ము
మునియె ప్రోద్గుణి వాల్మికి పూని వ్రాసి,
ముని విరించులఁ బ్రీతిని ముంచెఁ గేశ! 76



స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు

డెబ్బదియైదవ పద్యము: శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము [గర్భకవిత్వము]

ఓం నమో భగవతే వాసుదేవాయ

శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]


డెబ్బదియైదవ పద్యము:

చంపకమాల:
జిన! వనజోదరా! "మను భుజించెను తమ్ముఁడు! మాత!" యంచుఁ జెం
తనె వినుచన్, నుడుల్ విని, ఘనా! ముఖ మందున, వీక్ష సేయ వి
ష్ణుని నిను, నోటిలో జగముఁ జూపిన కృష్ణ! ప్రసన్నరూప! వే
దన నడఁతే! హరీ! వెసనుఁ దల్లినిఁ దన్పితె! వృష్ణి! కేశవా! 75

గర్భిత కందము:
వనజోదరా! "మను భుజిం
చెను తమ్ముఁడు! మాత!" యంచుఁ జెంతనె వినుచన్
నిను, నోటిలో జగముఁ జూ
పిన కృష్ణ! ప్రసన్నరూప! వేదన నడఁతే! 75

గర్భిత తేటగీతి:
"మను భుజించెను తమ్ముఁడు! మాత!" యంచు
విని, ఘనా! ముఖ మందున వీక్ష సేయ,
జగముఁ జూపిన కృష్ణ! ప్రసన్నరూప!
వెసనుఁ దల్లినిఁ దన్పితె! వృష్ణి! కేశ! 75



స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు

ఆదివారం, జులై 18, 2021

డెబ్బదినాలుఁగవ పద్యము: శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము [గర్భకవిత్వము]

ఓం నమో భగవతే వాసుదేవాయ

శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]


డెబ్బదినాలుఁగవ పద్యము:

చంపకమాల:
అదె, చెలి దుస్స్థితిన్, ఖరుఁడు, నా ఖల దూషణ కర్వరుండుఁ గ
న్నదరులతోఁ గడుం గినుక నందియుఁ, గైదువుఁ గేలఁ దాల్ప, నీ
వదె చెలఁగన్, వెసం గపిరథా! తిలకించి, పొకాల్చి, చంపితే
విధి బలిమిన్! సురల్, మునులఁ బ్రీతినిఁ దేల్చితె! పూజ్య! కేశవా! 74

గర్భిత కందము:
చెలి దుస్స్థితిన్, ఖరుఁడు, నా
ఖల దూషణ కర్వరుండుఁ గన్నదరులతోఁ
జెలఁగన్, వెసం గపిరథా!
తిలకించి, పొకాల్చి, చంపితే విధి బలిమిన్! 74

గర్భిత తేటగీతి:
ఖరుఁడు, నా ఖల దూషణ కర్వరుండుఁ
గినుక నందియుఁ, గైదువుఁ గేలఁ దాల్పఁ,
గపిరథా! తిలకించి, పొకాల్చి, చంపి,
మునులఁ బ్రీతినిఁ దేల్చితె! పూజ్య! కేశ! 74



స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు

శనివారం, జులై 17, 2021

డెబ్బదిమూఁడవ పద్యము: శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము [గర్భకవిత్వము]

ఓం నమో భగవతే వాసుదేవాయ

శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]


డెబ్బదిమూఁడవ పద్యము:

చంపకమాల:
ద్రుమ మిల నీడయౌ పసుల దోగ్ధల దాఁచిన బ్రహ్మ కప్డు జ్ఞా
నమె యుడుగన్, హరీ మహిమ నత్తఱిఁ జూపితి, మామమామ! యా
మము లిల సాలు కాన్, నిఖిల మాయలఁ ద్రుంచి, గణించి, నీవె యా
భ్రమ విడితే! నినున్ దెలిపి, వాక్పతిఁ దేర్చితె దీక్షఁ గేశవా! 73

గర్భిత కందము:
ఇల నీడయౌ పసుల దో
గ్ధల దాఁచిన బ్రహ్మ కప్డు జ్ఞానమె యుడుగ,
న్నిల సాలు కాన్, నిఖిల మా
యలఁ ద్రుంచి, గణించి, నీవె యా భ్రమ విడితే! 73

గర్భిత తేటగీతి:
పసుల దోగ్ధల దాఁచిన బ్రహ్మ కప్డు
మహిమ నత్తఱిఁ జూపితి, మామమామ!
నిఖిల మాయలఁ ద్రుంచి, గణించి, నీవె
తెలిపి, వాక్పతిఁ దేర్చితె దీక్షఁ గేశ! 73



స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు

గురువారం, జులై 15, 2021

డెబ్బదిరెండవ పద్యము: శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము [గర్భకవిత్వము]

ఓం నమో భగవతే వాసుదేవాయ

శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]


డెబ్బదిరెండవ పద్యము:

చంపకమాల:
యుగ ఘన! రాఘవా! గుణిత యోజన పాణినిఁ, గుక్షి గంటి, శ
త్రు గతు, ఖలుం, గడున్ భయద రూపుని, దుష్టుఁ, గబంధుఁ గాంచి, తా
రుగఁ జని, బద్ధులై, కరము లూడ్చిన, కాల్చిన కౌసలేయ! చి
జ్జగ వరదా! హరీ! గత సుసంస్థితి నిచ్చిన గణ్య! కేశవా! 72

గర్భిత కందము:
ఘన! రాఘవా! గుణిత యో
జన పాణినిఁ, గుక్షి గంటి, శత్రు గతు, ఖలుం,
జని, బద్ధులై, కరము లూ
డ్చిన, కాల్చిన కౌసలేయ! చిజ్జగ వరదా! 72

గర్భిత తేటగీతి:
గుణిత యోజన పాణినిఁ, గుక్షి గంటి,
భయద రూపుని, దుష్టుఁ, గబంధుఁ గాంచి,
కరము లూడ్చిన, కాల్చిన కౌసలేయ!
గత సుసంస్థితి నిచ్చిన గణ్య! కేశ! 72



స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు

బుధవారం, జులై 14, 2021

డెబ్బదియొకటవ పద్యము: శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము [గర్భకవిత్వము]

ఓం నమో భగవతే వాసుదేవాయ

శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]


డెబ్బదియొకటవ పద్యము:

చంపకమాల:
గురు! వసుధేశ్వరా! యబల కుబ్జ సుగంధము లాని, చొక్కి, సం
బరపడుచున్, వెసన్ బడుచు పజ్జనుఁ జేరి, త్రివక్రమూడ్చి, సుం
దరి పస యబ్బఁగా, స్థిరత నవ్య సుకోమల దేహమిత్తె! యం
దఱు కనఁగన్! హరీ! ప్రణతి దైత్యనిహంత! శుభాంగ! కేశవా! 71

గర్భిత కందము:
వసుధేశ్వరా! యబల కు
బ్జ సుగంధము లాని, చొక్కి, సంబరపడుచున్,
పస యబ్బఁగా, స్థిరత న
వ్య సుకోమల దేహమిత్తె! యందఱు కనఁగన్! 71

గర్భిత తేటగీతి:
అబల కుబ్జ సుగంధము లాని, చొక్కి,
పడుచు పజ్జనుఁ జేరి, త్రివక్రమూడ్చి,
స్థిరత నవ్య సుకోమల దేహమిత్తె!
ప్రణతి దైత్యనిహంత! శుభాంగ! కేశ! 71



స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు

మంగళవారం, జులై 13, 2021

డెబ్బదవ పద్యము: శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము [గర్భకవిత్వము]

ఓం నమో భగవతే వాసుదేవాయ

శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]


డెబ్బదవ పద్యము:

చంపకమాల:
నతి భువనేశ్వరా! నినుఁ గొనన్, యవనున్ గమనింపఁ ద్రిప్పి, యా
గత బిలమున్, గడున్ గుణవికాసు యతిన్ ముచికుందుఁ జేర, స
త్స్థితి జవయుక్తిమై పరుగుదీసి, వధన్ మునివర్యు కిత్తె! చి
జ్జిత గతివై! హరీ! ప్రణతి శ్రీధర! కైటభవైరి! కేశవా! 70

గర్భిత కందము:
భువనేశ్వరా! నినుఁ గొనన్,
యవనున్ గమనింపఁ ద్రిప్పి, యాగత బిలమున్,
జవయుక్తిమై పరుగుదీ
సి, వధన్ మునివర్యు కిత్తె! చిజ్జిత గతివై! 70

గర్భిత తేటగీతి:
నినుఁ గొనన్, యవనున్ గమనింపఁ ద్రిప్పి,
గుణవికాసు యతిన్ ముచికుందుఁ జేరఁ,
బరుగుదీసి, వధన్ మునివర్యు కిత్తె!
ప్రణతి శ్రీధర! కైటభవైరి! కేశ! 70



స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు

అఱువదితొమ్మిదవ పద్యము: శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము [గర్భకవిత్వము]

ఓం నమో భగవతే వాసుదేవాయ

శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]


అఱువదితొమ్మిదవ పద్యము:

చంపకమాల:
స్వయ మిలఁ బాపియౌ నెఱి నజామిళు చెంతఁ గనిష్ఠు నుంప, మే
రయ తలఁగన్, దనన్ యము తలారులె "ర"మ్మని యాగమింప, నా
రయఁ బిలువన్ సుతున్, "హరిని రాగిలి, పిల్చె" నటంచు నిత్తె, కృ
ష్ణ! యభవమున్! హరీ! ముగితి చాయనుఁ జేర్చితె, పూజ్య! కేశవా! 69

గర్భిత కందము:
ఇలఁ బాపియౌ నెఱి నజా
మిళు చెంతఁ గనిష్ఠు నుంప, మేరయ తలఁగన్,
బిలువన్ సుతున్, "హరిని రా
గిలి, పిల్చె" నటంచు నిత్తె, కృష్ణ! యభవమున్! 69

గర్భిత తేటగీతి:
నెఱి నజామిళు చెంతఁ గనిష్ఠు నుంప,
యము తలారులె "ర"మ్మని యాగమింప,
"హరిని రాగిలి, పిల్చె" నటంచు నిత్తె,
ముగితి చాయనుఁ జేర్చితె, పూజ్య! కేశ! 69



స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు

సోమవారం, జులై 12, 2021

అఱువదియెనిమిదవ పద్యము: శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము [గర్భకవిత్వము]

ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]


అఱువదియెనిమిదవ పద్యము:

చంపకమాల:
భజ దనుజారి! యా యుదధి, బాలుని, పంచజనోక్త దైత్యుఁ డొ
క్క జబురు కా, న్వెసం గడుపుఁ గంబువు నందు విగాహిఁ జేయఁ, జౌ
బుజ! చని, చీల్చియుం గనక బొందిని బాలునిఁ, గంబు వొంది, తె
త్తె జము దరి న్నతు ల్గొని, ద్రుతి న్గురు సూనునిఁ గూర్తె! కేశవా! 
68

గర్భిత కందము:
దనుజారి! యా యుదధి, బా
లుని, పంచజనోక్త దైత్యుఁ డొక్క జబురు కా,
న్జని, చీల్చియుం గనక బొం
దిని బాలునిఁ, గంబు వొంది, తెత్తె జము దరిన్! 
68

గర్భిత తేటగీతి:
ఉదధి, బాలుని, పంచజనోక్త దైత్యు
కడుపుఁ గంబువు నందు విగాహిఁ జేయఁ,
గనక బొందిని బాలునిఁ, గంబు వొంది,
కొని, ద్రుతి న్గురు సూనునిఁ గూర్తె! కేశ! 68



స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు

అఱువదియేడవ పద్యము: శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము [గర్భకవిత్వము]

ఓం నమో భగవతే వాసుదేవాయ

శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]


అఱువదియేడవ పద్యము:

చంపకమాల:
చని, దెసకుం గడున్ శఠుఁడు చక్రసమీరనిశాచరుండు గా
లినిఁ బనుపన్, హరీ! నిను సుడిన్ వడిఁ ద్రిప్పుచు, నింగిఁ జేర, వెం
టనె వసుషేణ! నీ వపు వనంత సహిష్ణుత భార మాన్చి, ద
ర్పి నడఁపితే! ఖలుం గడపి, ప్రీతిఁ బ్రజన్ వెసఁ గాతె! కేశవా! 67

గర్భిత కందము:
దెసకుం గడున్ శఠుఁడు చ
క్రసమీరనిశాచరుండు గాలినిఁ బనుపన్,
వసుషేణ! నీ వపు వనం
త సహిష్ణుత భార మాన్చి, దర్పి నడఁపితే! 67

గర్భిత తేటగీతి:
శఠుఁడు చక్రసమీరనిశాచరుండు
నిను సుడిన్ వడిఁ ద్రిప్పుచు, నింగిఁ జేర,
వపు వనంత సహిష్ణుత భార మాన్చి,
కడపి, ప్రీతిఁ బ్రజన్ వెసఁ గాతె! కేశ! 67



స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు

ఆదివారం, జులై 11, 2021

అఱువదియాఱవ పద్యము: శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము [గర్భకవిత్వము]

ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]


అఱువదియాఱవ పద్యము:

ఉత్పలమాల:
శ్రీవ్రత! సన్నుతా! సరసి చిత్సతి, మత్స్య ప్రశస్తరూప! స
త్యవ్రత సత్కృతిం గదిసి, తత్క్రమ వృద్ధినిఁ గాంచి, కాంచి, సు
ష్ఠువ్రతివై, కడున్నెదిగి శోభిత మత్స్యపరేశుఁడైతె వే
తీవ్ర హృతిన్! హరీ! భువినిఁ దేర్చితె, రక్షనుఁ బూన్చి! కేశవా! 66

గర్భిత కందము:
వ్రత సన్నుతా! సరసి చి
త్సతి మత్స్య ప్రశస్తరూప! సత్యవ్రత స
ద్వ్రతివై, కడున్నెదిగి శో
భిత మత్స్యపరేశుఁడైతె పెందీవ్ర హృతిన్! 66

గర్భిత తేటగీతి:
సరసి చిత్సతి, మత్స్య ప్రశస్తరూప!
కదిసి, తత్క్రమ వృద్ధినిఁ గాంచి, కాంచి,
యెదిగి శోభిత మత్స్యపరేశుఁడైతె!
భువినిఁ దేర్చితె, రక్షనుఁ బూన్చి! కేశ! 66



స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు

శనివారం, జులై 10, 2021

అఱువదియైదవ పద్యము: శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము [గర్భకవిత్వము]

ఓం నమో భగవతే వాసుదేవాయ

శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]


అఱువదియైదవ పద్యము:

చంపకమాల:
ధ్రువ! దనుజాంతకా! క్రమణ రూపునిఁ గేశినిఁ గంసుఁ డంపఁ, బో
యి, వెఱపిడన్, వెసన్ బెగడు హెచ్చిన గొల్లల, వీక్ష సేసి, ప్రో
వవె! ఘన హుంకృతిన్ నవయు భంగినిఁ జంపవె! నాఁటినుండి కే
శవుఁ డయితే! హరీ! జనులఁ జల్లఁగఁ గావవె! చక్రి! కేశవా! 65

గర్భిత కందము:
దనుజాంతకా! క్రమణ రూ
పునిఁ గేశినిఁ గంసుఁ డంపఁ, బోయి, వెఱపిడన్,
ఘన హుంకృతిన్ నవయు భం
గినిఁ జంపవె! నాఁటినుండి కేశవుఁ డయితే! 65

గర్భిత తేటగీతి:
క్రమణ రూపునిఁ గేశినిఁ గంసుఁ డంప,
బెగడు హెచ్చిన గొల్లల, వీక్ష సేసి,
నవయు భంగినిఁ జంపవె! నాఁటినుండి
జనులఁ జల్లఁగఁ గావవె! చక్రి! కేశ! 65



స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు

శుక్రవారం, జులై 09, 2021

అఱువదినాలుఁగవ పద్యము: శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము [గర్భకవిత్వము]

ఓం నమో భగవతే వాసుదేవాయ

శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]


అఱువదినాలుఁగవ పద్యము:

చంపకమాల:
భువి, బలిబంధనా! సగరపుత్రులు యాగపు సైంధవార్తి, దో
ష విషయులై చనం, గపిల! సంయతి భూమినిఁ గాంచి, నిన్ను భూ
ధవ! కలహాత్ములై తెగడ, దంభులఁ గాంచితె తీక్ష్ణ నేత్ర! బూ
ది వఱపితే! హరీ! నయ విధేయులఁ దేర్చితె! నంద! కేశవా! 64

గర్భిత కందము:
బలిబంధనా! సగరపు
త్రులు యాగపు సైంధవార్తి, దోష విషయులై
కలహాత్ములై తెగడ, దం
భులఁ గాంచితె తీక్ష్ణ నేత్ర! బూది వఱపితే! 64

గర్భిత తేటగీతి:
సగరపుత్రులు యాగపు సైంధవార్తిఁ,
గపిల! సంయతి భూమినిఁ గాంచి, నిన్నుఁ
దెగడ, దంభులఁ గాంచితె తీక్ష్ణ నేత్ర!
నయ విధేయులఁ దేర్చితె! నంద! కేశ! 64



స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు

గురువారం, జులై 08, 2021

అఱువదిమూఁడవ పద్యము: శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము [గర్భకవిత్వము]

ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]


అఱువదిమూఁడవ పద్యము:

చంపకమాల:
పృథుచతురబ్ధిసంవృతధరిత్రి తఱంకియుఁ, బెల్లగిల్ల, ధీ
పృథు నృప! త్వత్ క్రుధన్, దఱుమ, భీతిలి, పట్టువడంగఁ, జేరి, స
న్నిధి ధృత ధేనువౌ పృథివినిం బితుకంగనె, వెల్గె నుర్వి! పె
న్నిధు లొదవెన్! హరీ! పృథువు నీ కళ యౌట! విరించి! కేశవా! 63

గర్భిత కందము:
చతురబ్ధిసంవృతధరి
త్రి తఱంకియుఁ, బెల్లగిల్ల, ధీ పృథు నృప! త్వత్
ధృత ధేనువౌ పృథివినిం
బితుకంగనె, వెల్గె నుర్వి! పెన్నిధు లొదవెన్! 63

గర్భిత తేటగీతి:
వృతధరిత్రి తఱంకియుఁ, బెల్లగిల్లఁ
దఱుమ, భీతిలి, పట్టువడంగఁ, జేరి,
పృథివినిం బితుకంగనె, వెల్గె నుర్వి!
పృథువు నీ కళ యౌట! విరించి! కేశ! 63



స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు

బుధవారం, జులై 07, 2021

అఱువదిరెండవ పద్యము: శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము [గర్భకవిత్వము]

ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]


అఱువదిరెండవ పద్యము:

ఉత్పలమాల:
శ్రీ యమృతేశయా! నర వరేణ్య! మధుద్విష! నంద! శార్ఙ్గి! నా
రాయణ! సత్తపః స్థిరత వ్రక్కలు సేయఁగ దేవవేశ్య లా
హా! యమనమ్మునౌ నృతి వరాంశము "నూర్వశి సృష్టి" యాఁపె శౌ
రీ! యహహా! యదే యుపద యింద్రున కేఁగె నియుక్తిఁ గేశవా! 62

గర్భిత కందము:
అమృతేశయా! నర వరే
ణ్య! మధుద్విష! నంద! శార్ఙ్గి! నారాయణ! స
ద్యమనమ్మునౌ నృతి వరాం
శము "నూర్వశి సృష్టి" యాఁపె శౌరీ! యహహా! 62

గర్భిత తేటగీతి:
నర వరేణ్య! మధుద్విష! నంద! శార్ఙ్గి!
స్థిరత వ్రక్కలు సేయఁగ దేవవేశ్య
నృతి వరాంశము "నూర్వశి సృష్టి" యాఁపె!
నుపద యింద్రున కేఁగె నియుక్తిఁ గేశ! 62



స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు

మంగళవారం, జులై 06, 2021

అఱువదియొకటవ పద్యము: శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము [గర్భకవిత్వము]

ఓం నమో భగవతే వాసుదేవాయ

శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]

అఱువదియొకటవ పద్యము:

చంపకమాల:
అల సురదైత్యులే యమృత మంద రహించిన యంచయాన నా
మలహరుఁడే వెసం గన రమావర! నిన్నునుఁ గాంక్ష వేఁడ, తా
నిలఁ బరికింప, నీ వపుడు హేల రసోద్ధతి నాడి, మాయలన్
నిలిపితివే! హరీ! దెస గణించియు, మాయనుఁ ద్రెంతె! కేశవా! 61

గర్భిత కందము:
సురదైత్యులే యమృత మం
ద రహించిన యంచయాన నా మలహరుఁడే
పరికింప, నీ వపుడు హే
ల రసోద్ధతి నాడి, మాయలన్ నిలిపితివే! 61

గర్భిత తేటగీతి:
అమృత మంద రహించిన యంచయానఁ
గన, రమావర! నిన్నునుఁ గాంక్ష వేఁడ,
నపుడు హేల రసోద్ధతి నాడి, మాయ
దెస గణించియు, మాయనుఁ ద్రెంతె! కేశ! 61



స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు

సోమవారం, జులై 05, 2021

అఱువదవ పద్యము: శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము [గర్భకవిత్వము]

ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]


అఱువదవ పద్యము:

చంపకమాల:
నిజ బలగర్వియై పరఁగ నీ కల పూతన పాల నీయఁగా
ను జతనయై వెసన్ సరవి నూతన యుక్తినిఁ జంపఁ బూని దై
త్యజ చెలఁగన్, హరీ! యపుడు హాహల దుగ్ధము లాని, కొంటె యా
వృజిన యసుల్ సనన్ మనికిఁ బీల్చియు వెల్గితె! మాన్య! కేశవా! 60

గర్భిత కందము:
బలగర్వియై పరఁగ నీ
కల పూతన పాల నీయఁగాను జతనయై
చెలఁగన్, హరీ! యపుడు హా
హల దుగ్ధము లాని, కొంటె యా వృజిన యసుల్! 60

గర్భిత తేటగీతి:
పరఁగ నీ కల పూతన పాల నీయ,
సరవి నూతన యుక్తినిఁ జంపఁ బూని,
యపుడు హాహల దుగ్ధము లాని, కొంటె!
మనికిఁ బీల్చియు వెల్గితె! మాన్య! కేశ! 60



స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు

ఆదివారం, జులై 04, 2021

ఏఁబదితొమ్మిదవ పద్యము: శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము [గర్భకవిత్వము]

ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]


ఏఁబదితొమ్మిదవ పద్యము:

చంపకమాల:
సక! కనఁ, బాలనుం జవితి చంద్రునిఁ గాంచియు, శైలధారి! ఱొ
చ్చొకటొదవన్, హరీ!  యచలమూని శ్యమంతక మప్డు తేవ నీ
విఁకఁ జనుఁదేఱి యా యటవిఁ బెన్గొని, భల్లను నంది, కొంటె కొం
డొక సతినిన్, వెసన్ మణిని నుద్వహ మందిడ మాన్య! కేశవా! 59

గర్భిత కందము:
కనఁ, బాలనుం జవితి చం
ద్రునిఁ గాంచియు, శైలధారి! ఱొ చ్చొకటొదవన్,
జనుఁదేఱి యా యటవిఁ బె
న్గొని, భల్లను నంది, కొంటె కొండొక సతినిన్! 59

గర్భిత తేటగీతి:
చవితి చంద్రునిఁ గాంచియు, శైలధారి!
యచలమూని శ్యమంతక మప్డు తేవ
నటవిఁ బెన్గొని, భల్లను నంది, కొంటె
మణిని నుద్వహ మందిడ మాన్య! కేశ! 59



స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు

శనివారం, జులై 03, 2021

ఏఁబదియెనిమిదవ పద్యము: శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము [గర్భకవిత్వము]

ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]


ఏఁబదియెనిమిదవ పద్యము:

చంపకమాల:
ధ్రువ! వరగర్వియై ప్రబలు, తుంబుర శప్త విరాధ నాము, భూ
జ వడిఁ గొనన్, వెసన్ దనుజుఁ జంపఁగఁ గోలలఁ దాల్చి, కొట్టి, మా
నవ వర! రక్కసున్, వపువు నజ్జు రహింపగఁ బాఁతి, చంపి, శూ
ర! వఱలితే! హరీ! సుర విరాజితుఁ జేసితె క్షుద్రుఁ గేశవా! 58

గర్భిత కందము:
వరగర్వియై ప్రబలు, తుం
బుర శప్త విరాధ నాము, భూజ వడిఁ గొనన్,
వర! రక్కసున్, వపువు న
జ్జు రహింపగఁ బాఁతి, చంపి, శూర! వఱలితే! 58

గర్భిత తేటగీతి:
ప్రబలు తుంబుర శప్త విరాధ నాము,
దనుజుఁ జంపఁగఁ గోలలఁ దాల్చి, కొట్టి,
వపువు నజ్జు రహింపగఁ బాఁతి, చంపి,
సుర విరాజితుఁ జేసితె క్షుద్రుఁ గేశ! 58



స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు