మిత్రులందఱకు నమస్సులు!
నేను తేది:30-11-2017 నాఁడు
ప్రభుత్వ ఉన్నత పాఠశాల, శంభునిపేఁట నుండి
తెలుఁగు స్కూల్ అసిస్టెంటుగా పదవీ విరమణము నందుచున్న సందర్భమున
పాఠశాలలో నేఁడు అనఁగా తేది:29-11-2017న
పదవీ విరమణ సన్మానోత్సవము ఏర్పాటుచేసినారు.
నన్ను అభినందించుచు
మహోదయులు "శంకరాభరణం" బ్లాగు నిర్వాహకులు
మన్మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారు
పద్య రూప సన్మాన పత్రము రచించినారు.
అట్లే
మదీయ సహోద్యోగి, తెలుఁగు స్కూల్ అసిస్టెంటు
శ్రీ చెరుకుపెల్లి వెంకట శేషాచార్యులు గారు
వచన రూప సన్మాన పత్రము రచించినారు.
వారికి నా మనఃపూర్వక కృతజ్ఞతాభివందనములు!
ఆ సన్మాన పత్రములను మీ యందఱ ముందుంచుచుంటిని.
నిండు మనస్సుతో పఠించి, నన్నాశీర్వదించఁగలరు.
స్వస్తి