ఓం శ్రీ మాత్రేనమః!
మిత్రులు శ్రీ గుండవరము హనుమంత రావు Hanumanth Rao Gundavaram) గారు
"పద్యామృతం" facebook లో కోరినట్లుగానే...
దత్తపదిలో... అలి-నోలి-కోలి-మొలి...శబ్దముల నుపయోగించి
నచ్చిన ఛందస్సులో
లలితాదేవి స్తుతి పద్యము వ్రాయమనగా
నేను వ్రాసిన ఆటవెలఁది పద్యము
ఆ.వె.:
’అలి’కనేత్రి! హే సకల జగత్ప్రసవిత్రి!
సతముఁ గొల్తు ’నోలి’ శైలపుత్రి!
త్రిపురసుందరి! కసరేల’కో? లి’ప్స నా
కీఁ గరుణ రస ’మొలి’కింపు ధాత్రి!!
స్వస్తి.