తేది: జూన్ 21, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా రెండు పూరణములు
(శిశుపాలుఁడు దుడుకుతనముతోఁ దన బావ శ్రీకృష్ణునకు వెన్నకు బదులుగ సున్నమిమ్మని తన తల్లితోఁ జెప్పు సందర్భము)
(1)
కన్నఁ డిటు వచ్చి "యత్తా!
వెన్ననుఁ దె" మ్మంచుఁ బల్క, వేగమె "యమ్మా!
వెన్ను నిట బన్నపఱుపఁగ
సున్న మిడవె! యన్న మేల చుట్టంబునకున్?"
కన్నఁ డిటు వచ్చి "యత్తా!
వెన్ననుఁ దె" మ్మంచుఁ బల్క, వేగమె "యమ్మా!
వెన్ను నిట బన్నపఱుపఁగ
సున్న మిడవె! యన్న మేల చుట్టంబునకున్?"
*** *** *** ***
నా రెండవ పూరణము:
(2)
కన్నము వేసెడి దొంగల
కన్ననుఁ బది రెట్లు చోర కాంక్షిత మతులౌ
నన్నల కిపు డో రమణీ
సున్న మిడవె! యన్నమేల చుట్టంబునకున్?
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి