తేది: మే 19, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణములు
నా మొదటి పూరణము:
ద్విజుఁడు గరుడుండుఁ దేరయ్యె విష్ణువునకు!
ద్విజుఁడు శేషుండుఁ బరుపయ్యె విష్ణువునకు!
బండియుం బాన్పులై విష్ణు భక్తులయ్యు
మాంసభక్షణచే ద్విజుల్ మాన్యులైరి!!
(ద్విజుఁడు = రెండు పుట్టుకలు కలవాఁడు > [గ్రుడ్డుగా మొదటిజన్మ, గ్రుడ్డులోనుండి రెండవ జన్మగల] గరుడుఁడు, ఆదిశేషుఁడు...ఇద్దఱును మాంసాహారులే యయినను విష్ణుసేవయొనర్చి మాన్యులైనారు కదా!)
*** *** *** ***
నా రెండవ పూరణము:
యజ్ఞపశువును బలియిచ్చి, యట్టి మాంస
మునుఁ దినన్ దామసులకిడి, భుక్తులుగ నొ
నర్పఁ, దద్యజ్ఞఫలదపుం దామస కృత
మాంస భక్షణచే, ద్విజుల్ మాన్యులైరి!
*** *** *** ***
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి