తేది: మే 28, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన (ఛందోగోపనం, దుష్కరప్రాసతోఁ గూడిన) సమస్యకు నా పూరణములు
నా మొదటి పూరణము:
(యుద్ధవిరమణ సమయమైనదని సైంధవుని నమ్మించుటకు శ్రీకృష్ణుఁడు తన చక్రమును సూర్యున కడ్డుగ నుంచిన సందర్భము ననుసంధానించుకొనునది)
సద్వ్యసనులు పాండవుల న
సద్వ్యసనపరుండు దుష్ట సైంధవుఁ డడ్డన్
దద్వ్యక్తిఁ జంపఁ దివుర జ
గద్వ్యాప్తములయ్యె నిరులు ఖరకరుఁ డుండన్!
*** *** *** ***
నా రెండవ పూరణము:
(పతివ్రతా మతల్లి సతీసుమతి ప్రస్తావనము నిట ననుసంధానించుకొనునది)
యద్వ్యాపిత పదము తాఁక, యతి శాప మిడన్,
త ద్వ్యపగతి నిడె సుమతి! జ
గద్వ్యాప్తములయ్యె నిరులు, ఖరకరుఁ డుండన్!!
*** *** *** ***
నా మూఁడవ పూరణము:
(వర్షఋతువున మేఘములు క్రమ్ముకొనఁగా దట్టముగఁ జీఁకటులు క్రమ్మిన సందర్భము)
ఘనబృందము క్రమ్ముకొనె; జగద్వ్యాప్తముల
య్యె నిరులు ఖరకరుఁ డుండన్;
జినుకులు దట్టమ్ములయ్యె జేజే వీథిన్!
రిప్లయితొలగించండిమూడు పద్యాలూ బాగున్నవి.అభినందనలు.
ధన్యవాదాలు కమనీయంగారూ! మీ సహృదయతకు జోహారులు!! స్వస్తి.
రిప్లయితొలగించండిదేనికదే అద్భుతమైన పూరణ... చక్కని పూరణలు... అభినందనలు.
రిప్లయితొలగించండిసైంధవుడి చిత్రాన్ని సేవ్ చేసుకున్నాను.. శంకరాభరణంలో ‘పద్యరచన’ శీర్షికలో ఇవ్వడానికి... ధన్యవాదాలు.
సంతోషం! ధన్యవాదాలు శంకరయ్యగారూ!
రిప్లయితొలగించండి