తేది: మే 15, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము
నా మొదటి పూరణము:
[వోఢ(నందీశ్వరుఁడు) వ్యాధిగ్రస్తుఁడై మార్గమధ్య మందశక్తుఁడై వేడుకొనఁగా, హరుఁ డక్కడనే యున్న గాడిదపై నెక్కి కాశికిఁ నేఁగిన సందర్భము]
వేడుక తోడుత వృషభా
రూఢుండై చనుచునుండ, రుజ బాధితుఁడై
వోఢయె వేడఁగ, నచ్చటి
గాడిదపై నెక్కి, హరుఁడు కాశికి నేఁగెన్!
[శంకరుఁడు భక్త వశంకరుఁడు కావున నందీశ్వరుని బాధించలేకయే దాఁపుననున్న గాడిదపై నెక్కి కాశికిఁ జనెనని చమత్కారము!]
*** *** *** ***
నా రెండవ పూరణము:
నాఁ డట వేషములన్ గొని,
తోడుగఁ దన పరిజనమ్ముతో, నా వింతన్
వేడుకఁ గనఁ బ్రజ, మోటరు
"గాడి"దపై నెక్కి, హరుఁడు కాశికి నేఁగెన్!
*** *** *** ***
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి