తేది: మే 08, 2015 నాటి శంకరాభరణంలోని పద్యరచన శీర్షికన ఈయబడిన చిత్రమునకు నేను వ్రాసిన ఉత్పలమాలికా వృత్తము
త్రాగుదమన్న నీరమెది? దాహము తీరదు! నీటికోసమై
ప్రోగుపడంగ సర్వులకుఁ బోవునె దుఃఖము? నీరు తోడఁగా
వేగిర మంద నీరమును బిందెయు నింపదు! మంటిలోపలన్
బాగుగ నీర మెద్ది? ఘనవర్షము లొక్కట రాక ముందఱన్
వాగులు వంకలన్ మిగుల బాగొనరించియు వేగ పూడికల్
త్యాగయుతాత్ములై త్వరగఁ ద్రవ్వియుఁ దీసియు సాగుచేయఁగా,
వేగమె నీర మెంతొ యిడుఁ బ్రీతిగ వాపి తటాకముల్ సదా!
మీ పద్యంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘మిషన్ కాకతీయ’ ప్రభావం ఉన్నట్టుంది. ఉండాలి కూడా! చక్కని పద్యాన్ని రచించారు. అభినందనలు.
రిప్లయితొలగించండిఅవును! మీరు నిజమే చెప్పారు శంకరయ్యగారూ! నా పద్యం మీకు నచ్చినందుకు ధన్యవాదాలు! _/|\_
రిప్లయితొలగించండి