Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

గురువారం, జూన్ 04, 2015

దత్తపది: పూరి-వడ-దోస-గారె....భారతార్థంలో...నచ్చిన ఛందంలో...

తేది: మే 09, 2015 నాటి శంకరాభరణంలోని దత్తపది శీర్షికన ఈయబడిన
పూరి - వడ - దోస - గారె.
పదాలను ఉపయోగిస్తూ భారతార్థంలో
నచ్చిన ఛందంలో పద్యాన్ని వ్రాయమనగా
నేను వ్రాసిన తేటగీతి పద్యము



(ఉత్తరగోగ్రహణ సమయమున నంతఃపురకాంతల ముందఱ, బృహన్నల ముందఱ నుత్తరుని ప్రగల్భములు)

"పూరిఁ గఱపించెదను నేను కౌరవులకు!
వడవడ వణకఁ జేసెద బవరమందు!
దోసమును సైఁచుమన్నచోఁ దొఱఁగి చనెద!
పిఱికివారలుగారె యా విమతులంత!"


4 కామెంట్‌లు: