తేది: మే 22, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము
(జనాపవాద భీతిచే శ్రీరాముఁడు సీత నరణ్యమునకుఁ బంపఁగా నచటఁ బ్రాణత్యాగ మొనర్పఁబోవు సీతను వాల్మీకి తన యాశ్రమమునకుం గొంపోయిన తదుపరి యేర్పడిన పరిస్థితులను వివరించు సందర్భము)
చేరంబిల్చియు, దుఃఖవి
దూరుఁడు వాల్మీకిముని బ్రతుకు నిడె! నచటన్
ధీరు లొదవి, యశ్వముఁ గొన,
మారుతి యేతెంచె! సీత మాయం బయ్యెన్!!
మధుసూదన్ గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధన్యవాదాలు శంకరయ్యగారూ!
రిప్లయితొలగించండి