_/|\_ నా పూరణ మీ మెప్పును పొందినందులకు ధన్యుడను. వ్యాఖ్యానించినందులకు కృతజ్ఞతలు. ఇలాగే ప్రతి టపానూ వీక్షించి మీ అమూల్యమైన సూచనలను అందజేయగలరు. ధన్యవాదములతో...భవదీయుడు...గుండు మధుసూదన్.
_/|\_ ఎంతమాటన్నారు కొండలరావుగారూ! మీ బోటిపెద్దలు పండితుల రచనలే కాకుండా మాలాంటివారి రచనలు చదివి చదివి యీ ప్రతిభావ్యుత్పత్త్యభ్యాసాలనెప్పుడో పొందారు. మీకీపద్యాలు సులభగ్రాహ్యాలేనని నా నమ్మకం. స్పందించి వ్యాఖ్యానించినందుకు కృతజ్ఞతలు. స్వస్తి.
ప్రతిభ (నవనవోన్మేషశాలినీ ప్రతిభా అని కదా ఈ మాటకు వ్యాఖ్యానం మరి. కొత్తచిగుళ్ళు వేయగల ఊహల ప్రజ్ఞచాలా అవసరం కవికి)
వ్యుత్పత్తి (కవిత్వం చెప్పగలగటమే కాదు చెప్పటమూ తగినంత పరిమాణంలో లేనిదే గుర్తింపు ఉండదు. అంతసుళువూ కాదు హఠాత్తుగా అవసరం ఐనప్పుడు వ్యత్పన్నం చేయటం. ఇదీ వ్ అంత రాటుదేరుతుంది ప్రజ్ఞ)
వ్యాకరణము,ఛందోఽలంకృతాకరములు. (ఊరికి కరణమూ, భాషకు వ్యాకరణమూ శత్రువులని సామెత. అలాగా భాషను అదుపులో ఉంచే వ్యాకరణం మన అదుపులో లేకపోతే విద్వజ్జనరంజకంగా చెప్ప నలవి కాదు కదా. ఇక ఛందస్సు అనేది రౌతుకొద్దీ ఆడే గుఱ్ఱం అన్నమాటే. అలంకారాలు కవిత్వాలకూ సొబగులే. ఉన్నవి తెలిస్తే కదా కొత్తవి చేసి కవి తొడగగలికేది కవితా కన్యకు మరి)
భాషపైనను నధికారము. (ఇదొక గడ్డుసమస్య. సమకాలీనుల్లోనే ఒకడి భాషావైదగ్ధ్యం మరొకరికి నచ్చేనా ఒకపట్టాన. సమకాలము వారలు మెచ్చరే కదా అని ఊరకే అనలేదు. పాషాణపాకప్రభువు అనిపించుకొన్న విశ్వనాథభాషకే కొత్త సత్యనారాయణ చౌదరిగారు తాటాకులు కట్టి ఎద్దేవా చేస్తూ పుస్తకాలే వ్రాసారు. అందుచేత సరస్వతీకటాక్షం లేకపోతే ఏదీ లేదు. ఉన్నవారికి కవిత్వానికి కొదవలేదు. ఇది మహా అవసరం)
ఇవన్నీ అవసరమైన పాళ్ళలో సమకూరితే రసవంతమైన పద్యాలు వస్తాయి, నల్లెరుం బండిగా. నిజమే. బాగా అంతా ఒక చిన్న పద్యంలో వ్రాసారు. బాగు బాగు.
మీ పూరణ సహేతుకంగా, సమర్థనీయంగా, ప్రశంసార్హంగా ఉంది. అభినందనలు.
రిప్లయితొలగించండి_/|\_ నా పూరణ మీ మెప్పును పొందినందులకు ధన్యుడను. వ్యాఖ్యానించినందులకు కృతజ్ఞతలు. ఇలాగే ప్రతి టపానూ వీక్షించి మీ అమూల్యమైన సూచనలను అందజేయగలరు. ధన్యవాదములతో...భవదీయుడు...గుండు మధుసూదన్.
రిప్లయితొలగించండి<< ప్రతిభ, వ్యుత్పత్తి, యభ్యాస పటిమ గలిగి, వ్యాకరణము,ఛందోఽలంకృతాకరములుఁ గలిగి, భాషపైనను నధికారమున్నఁ >>
రిప్లయితొలగించండిఇవన్న మాట పద్య రచనకు కావలసినవి. అవి ఉన్నవారికి నల్లేరు మీద నడక, లేని మావంటి వారికి చదవడానికి కావాలి పడక.
_/|\_ ఎంతమాటన్నారు కొండలరావుగారూ! మీ బోటిపెద్దలు పండితుల రచనలే కాకుండా మాలాంటివారి రచనలు చదివి చదివి యీ ప్రతిభావ్యుత్పత్త్యభ్యాసాలనెప్పుడో పొందారు. మీకీపద్యాలు సులభగ్రాహ్యాలేనని నా నమ్మకం. స్పందించి వ్యాఖ్యానించినందుకు కృతజ్ఞతలు. స్వస్తి.
రిప్లయితొలగించండిగుండువారూ, మీ పద్యం చాల బాగుంది.
రిప్లయితొలగించండిప్రతిభ (నవనవోన్మేషశాలినీ ప్రతిభా అని కదా ఈ మాటకు వ్యాఖ్యానం మరి. కొత్తచిగుళ్ళు వేయగల ఊహల ప్రజ్ఞచాలా అవసరం కవికి)
వ్యుత్పత్తి (కవిత్వం చెప్పగలగటమే కాదు చెప్పటమూ తగినంత పరిమాణంలో లేనిదే గుర్తింపు ఉండదు. అంతసుళువూ కాదు హఠాత్తుగా అవసరం ఐనప్పుడు వ్యత్పన్నం చేయటం. ఇదీ వ్ అంత రాటుదేరుతుంది ప్రజ్ఞ)
వ్యాకరణము,ఛందోఽలంకృతాకరములు. (ఊరికి కరణమూ, భాషకు వ్యాకరణమూ శత్రువులని సామెత. అలాగా భాషను అదుపులో ఉంచే వ్యాకరణం మన అదుపులో లేకపోతే విద్వజ్జనరంజకంగా చెప్ప నలవి కాదు కదా. ఇక ఛందస్సు అనేది రౌతుకొద్దీ ఆడే గుఱ్ఱం అన్నమాటే. అలంకారాలు కవిత్వాలకూ సొబగులే. ఉన్నవి తెలిస్తే కదా కొత్తవి చేసి కవి తొడగగలికేది కవితా కన్యకు మరి)
భాషపైనను నధికారము. (ఇదొక గడ్డుసమస్య. సమకాలీనుల్లోనే ఒకడి భాషావైదగ్ధ్యం మరొకరికి నచ్చేనా ఒకపట్టాన. సమకాలము వారలు మెచ్చరే కదా అని ఊరకే అనలేదు. పాషాణపాకప్రభువు అనిపించుకొన్న విశ్వనాథభాషకే కొత్త సత్యనారాయణ చౌదరిగారు తాటాకులు కట్టి ఎద్దేవా చేస్తూ పుస్తకాలే వ్రాసారు. అందుచేత సరస్వతీకటాక్షం లేకపోతే ఏదీ లేదు. ఉన్నవారికి కవిత్వానికి కొదవలేదు. ఇది మహా అవసరం)
ఇవన్నీ అవసరమైన పాళ్ళలో సమకూరితే రసవంతమైన పద్యాలు వస్తాయి, నల్లెరుం బండిగా. నిజమే. బాగా అంతా ఒక చిన్న పద్యంలో వ్రాసారు. బాగు బాగు.
ధన్యవాదాలు శ్యామలీయంగారూ,
రిప్లయితొలగించండినా పద్యం మీ మెప్పును పొందినందుకు నా కెంతో ఆనందంగా ఉంది. మీ వ్యాఖ్యానమూ బాగున్నది. అభినందనలు. ధన్యవాదాలు.