తేది: జనవరి 06, 2015 నాటి శంకరాభరణంలోని దత్తపది శీర్షికన ఈయబడిన
రామ - భరత - లక్ష్మణ - శత్రుఘ్న
పదాలను ఉపయోగిస్తూ
భారతార్థంలో
నచ్చిన ఛందంలో
పద్యం వ్రాయమనగా
నేను వ్రాసిన కంద పద్యము మరియు తేటగీతి పద్యములు
(దుర్యోధనుని ఘోషయాత్ర....)
కందపద్యము:
ఆరామగతులుఁ బాండుకు
మారులునౌ భరతకులుల మానము డుల్పన్
జేరెను లక్ష్మణ యుతుఁడై
రారాట్ శత్రుఘ్నునంచు రంజిలుచు వెసన్!
తేటగీతి:
ఏ విరామ మెఱుంగని హీన యోచ
నాస్థ లోభరతుఁడు కౌరవాగ్రజుండు
లక్ష్మణునిఁ గన్నతండ్రి దుర్లక్షణుండు
విఘ్నమిడఁగా వనిఁ జనె శత్రుఘ్నులకును!
(శత్రుఘ్నులు=శత్రునాశకులైన పాండవులు)
ఆరామగతులుఁ బాండుకు
మారులునౌ భరతకులుల మానము డుల్పన్
జేరెను లక్ష్మణ యుతుఁడై
రారాట్ శత్రుఘ్నునంచు రంజిలుచు వెసన్!
తేటగీతి:
ఏ విరామ మెఱుంగని హీన యోచ
నాస్థ లోభరతుఁడు కౌరవాగ్రజుండు
లక్ష్మణునిఁ గన్నతండ్రి దుర్లక్షణుండు
విఘ్నమిడఁగా వనిఁ జనె శత్రుఘ్నులకును!
(శత్రుఘ్నులు=శత్రునాశకులైన పాండవులు)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి