తేది: ఏప్రిల్ 28, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా రెండు పూరణములు
మొదటి పూరణము:
(హరిహరాద్వైతముంగూర్చి యిద్దఱు పండితులు తర్కించు సందర్భము)
శివుఁ డనఁగ "శుభముల నొసంగి వరము లిడి
కాచువాఁ"డన, హరిహరుల్ గారె సములు?
"పరమశివునితో లక్ష్మియుఁ బవ్వళించె"
ననిన, "హరితోడఁ బవళించె" ననుట కాదె?
*** *** *** ***
రెండవ పూరణము:
బ్రహ్మతోఁ గూడియును సరస్వతియుఁ బోయె!
వఱలు కైలాసగిరిఁ జేరెఁ బార్వతియునుఁ
బరమశివునితో! లక్ష్మియుఁ బవ్వళించెఁ
బాలమున్నీటను హృదయేశ్వరునితోడ!
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నాయి. అభినందనలు.
రిప్లయితొలగించండిమీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నాయి. అభినందనలు.
రిప్లయితొలగించండిధన్యవాదాలు శంకరయ్యగారూ!
రిప్లయితొలగించండి