తేది: ఏప్రిల్ 06, 2015 నాటి శంకరాభరణంలోని దత్తపది శీర్షికన
గుణము - తృణము- రణము - పణము
పదాలను ఉపయోగిస్తూ
భారతార్థంలో
నచ్చిన ఛందంలో పద్యం వ్రాయమనగా
నేను వ్రాసిన తేటగీతి పద్యము
(శ్రీకృష్ణుఁడు కురుసభలో తన దౌత్యము యుద్ధమునకు దారితీయఁగా, లోన సంతసించుచుఁ దనలోఁ దాననుకొను సందర్భము)
దుర్గుణముచేతఁ గౌరవుల్ దురము సేఁతఁ
గోరుచుండిరి తృణమంత కూర్మి లేక!
యిదియుఁ బాండవులకు జయ హేతువ యగుఁ!
బ్రబల శత్రుల నాశ కారణము నైన
బవరముం జేసి, సిరిగొంట పణము కాదె?
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి