అంశం- భూకంపము.
ఛందస్సు- తేటగీతి
నాలుగు పాదాల మొదటి అక్షరాలు వరుసగా
‘భూ - కం - ప - ము’ ఉండాలనగా
నేను వ్రాసిన రెండు తేటగీతులు
మొదటి పూరణము:
భూనభో౽౦తరమధ్యమ్ము భోరుమనెడి
కంపనోద్భూత విలయ సంఘట్టనములు
పల్లెలం బట్టణమ్ములఁ బగులఁ జీల్చి,
ముప్పుఁగలిగించె నేపాళభూమికకట!
రెండవ పూరణము:
భూమిజనదుష్కృతోద్ధృతస్ఫోటజనిత
కంపితోద్విగ్ననేపాళఘనచరిత్ర
పతనమాయెను భూకంప భండనమున!
ముక్తజీవావసధులైరి భూమిజనులు!!
మధుసూదన్ గారూ,
రిప్లయితొలగించండిఅద్భుతమైన పద్యాలు మీ బ్లాగును శోభాయమానం చేస్తున్నవి. అభినందనలు.
ధన్యవాదాలు శంకరయ్యగారూ!
రిప్లయితొలగించండి