తేది: ఏప్రిల్ 12, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము
(శ్రీరాముఁడు చంద్రవంశజుఁడని పొరపాటుగా బోధించిన ఉపాధ్యాయుఁడు, తన తప్పును సమర్థించుకొనుచుఁ బలికిన సందర్భము)
చంద్రముఖ, చంద్రసుషిమ, సుచంద్రదీప్తి,
చంద్రధవళితసత్కీర్తి, చంద్రగరిమ,
చంద్రసత్వగుణాంచితచాతురిఁ గనఁ
జంద్రవంశ్యుఁడు శ్రీరామచంద్రుఁడు గద!!
సర్వం చంద్రమయమైన శ్రీరాముణ్ణి చంద్రవంశీయుణ్ణి చేసిన మీ పూరణలోని చమత్కారం ప్రశంసనీయం.
రిప్లయితొలగించండిధన్యవాదాలు శంకరయ్యగారూ!
రిప్లయితొలగించండి