Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

మంగళవారం, జూన్ 07, 2016

స్వరాష్ట్ర సాధకుఁడు...ఉద్యమ నేత...కేసీఆర్!

రవీంద్ర భారతిలో మొన్న ఆదివారం నాడు తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ మఱియు తెలంగాణ పద్య కవితా సదస్సు ఆధ్వర్యంలో జరిగిన పద్య తెలంగానంలో నేను పఠించిన పద్యాలు...


సీసము:
అఱువది యేఁడుల యాంధ్రాధిపత్యమ్ము
        నంతమ్ముఁ జేయంగఁ బంతమూని,
తెలఁగాణు లందఱ నిల నొక్క త్రాఁటి పైఁ
        కినిఁ దెచ్చి బలమిచ్చి ఘనత నూని,
నీరముల్ భూములు నిధులును గొలువులు
        వనరులం దోచిన పగిదిఁ దెలిపి,
తీవ్రమౌ పలుకులఁ "దెలఁగాణ వచ్చుడో
        కేసియార్ చచ్చుడో" కృత ప్రతిజ్ఞుఁ

డైన "కేసియార్ వ్రతదీక్ష", యాంధ్ర పాల
కులకుఁ బ్రక్కలో బల్లెమై, కునుకు నిడక,
చోద్యముగఁ దెలంగాణ రాష్ట్రోద్యమమును
ఢిల్లి కనిపి, సాధించె రాష్ట్రేప్సితమును!
 (1)

ఉత్పలమాల:
ఈ తెలఁగాణ మాట యిఁక నెప్పుడు వల్కక యుండ నాజ్ఞ నా
నేతయు చంద్రబాబె యిడ; నిత్యము నీ తెలఁగాణ నామమే
చేతము పొంగఁగా వినిచె, శీఘ్ర మసెంబ్లియె మ్రోగఁ గేసియార్!
నేత యతండు రా! ఘన వినీతుఁడు, ధీరుఁడు, పుణ్య మూర్తిరా!! 
(2)

ఉత్సాహము:
"సకల జనుల సమ్మె" చేసి, శాశ్వతముగఁ బ్రజల హృ
త్ప్రకర మందు నిలిచి వెలిఁగి, రాష్ట్ర సాధనమునకై
రకరకమ్ములైన వ్యూహ రచనములనుఁ జేసియున్
బ్రకటిత మ్మొనర్చెఁ బ్రజల రాష్ట్ర కాంక్ష ఢిల్లికిన్!
 (3)

సీసము:

ఒక వంక నమరె సదుద్యమ స్ఫూర్తికై
        తెలఁగాణ జనభేరి దివ్య కృతము;
నొక చెంత నలరెఁ జెల్వొప్పఁగాఁ దెలఁగాణ
        సాగరహార సంజనిత వ్రతము;
నొక చోట మించె సముత్సుక తెలఁగాణ
        జనుల ధూంధాము చేతన గళములు;
నొకట నుజ్జృంభించె నుత్సాహ యుక్తమౌ
        సభ విరాజిల్లు ప్రసంగ ఫణితి;

యంత సమ్మెలు హర్తాళు లమర వీర
కలిత బలిదానములు సముత్కంఠ నిడఁగ,
నీ తెలంగాణ మంతయు నెద రగులఁగఁ,
జెలఁగె నిరశన వ్రతి చంద్రశేఖరుండు! 
(4)

శార్దూలము:
ఢిల్లీకిం జని కేసియారె యచటన్ దిక్కుల్ ప్రకంపింప ఱం
పిల్లం జేసె స్వరాష్ట్ర కాంక్ష నినదం; బెల్లన్ సముత్కీర్ణ హృ
త్ఫుల్లాంభోజ సభాంతరాళ మలరన్ బోరాడి, సాధించె సం
సల్లీలన్ దెలఁగాణ రాష్ట్రమును నుత్సాహమ్ము దీపింపఁగన్!
 ( 5)

స్వస్తి

మధురకవి, సహస్ర కవి భూషణ
గుండు మధుసూదన్
వరంగల్


5 కామెంట్‌లు:

 1. మరి శ్రీకాంతాచారి తో సహా వేయి మందికి పైగా అసువులు బాసిన వారెవరు? జయశంకర్ సారు ఎవరు? సమిధలా? నేతలకేనా జేజేలు? కె సి అర్ వారికి పద్యాలు సరే మరి ఆ పద్యాళ్ళో వీరెక్కడా? ఆంధ్రాదిపత్యము నుండి దొరల ఆధిపత్యానికి జరిగిన ఆదిపత్యపు బదిలీ కి సంబురాలు కూడానా? రెండేళ్ళ పాలన అనంతరం సమీక్ష జరిగిందా? ఆంధ్ర ఆధిపత్యము ఎక్కడా లేనట్టేనా? మరి కాంట్రాక్టులన్ని ఆంధ్రులకే కట్టబెట్టినట్టున్నారే? తాయిలాల పద్యాలని శీర్షిక పెట్టాల్సింది.

  రిప్లయితొలగించండి
 2. కుత్సిత బుద్ధితో ప్రశ్నిస్తున్న వానికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. నీకు అన్ని సమాధానాలు ఈ బ్లాగులో దొరుకుతాయి: నా తెలంగాణ రత్నాల వీణ బ్లాగులోని అన్ని పద్యాలూ చదివి....ఆ తర్వాత విషం కక్కు! [ఈ ఖండికలో నేను పది పద్యాలు రాసుకున్నాను. వాటిలో సెలెక్ట్ చేసుకున్నవి ఐదు]

  మెదడుంటే అన్ని అంశాలూ అర్థమౌతాయి. నేను నాలుగో పద్యంలోనే చెప్పాను. నీలాంటి మెదడు లేని వాళ్ళకు అర్థం కాదు. నేను నాలుగో పద్యంలో తెలంగాణ సాధనోద్యమం గూర్చి పూర్తిగా చెప్పాను. ఆ ఉద్యమంలో ఎందరో కష్టాలననుభవించారని నీ బుర్రకు తడితేగా...దానికి ప్రోత్సాహకుడు కేసీఆర్ కాకపోతే మరెవరు? వంకర బుద్ధి బయటపెట్టుకున్నావు.

  రిప్లయితొలగించండి
 3. ఓహూ బిచ్చమేసావా, తప్పును ఎత్తి చూపితే వంకర బుద్దీ, బుజాలు రాసుకుంటే సద్బుద్ధీ నా, బాగుంది ప్రాపగాండా, ప్రోత్సాహకుడు కె సి ఆరా? ఇదెం బుద్ధి? దృతరాష్ట్ర గుడ్డి బుద్ధా? కచరా వారు పుట్టిన తరువాతనే ఉద్యమం పుట్టినట్టు ఉరుముతున్నావు, అసలు వీరులందరికి ఒక ముక్క విదిల్చి గుంటకాడ నక్కలా కాచి ఫలాన్ని అనుభవిస్తున్న ముక్కు యోధుడికి సీస పద్యాల? సిగ్గులేదా కప్పి పుచ్చుకోవడానికి? బాగుంది నీ యవ్వారం కాని బంగారు తెలంగాణా కథ పక్కనపెట్టు, ఉన్న తెలంగాణాను దోచుకుంటే తరిమి తరిమి కొడతాం జాగ్రత్త.

  రిప్లయితొలగించండి
 4. పూర్తిపేరూ...అడ్రస్సూ...కూడా బహిర్గతం చేసుకోలేని చవట సన్నాసివి... నన్ను బెదిరించడమా? ఎవని మోచేతికిందో నీళ్ళుతాగుతూ...వానికి అధికారం రాకపోయేసరికి, కేసీఆర్ పై ద్వేషం పెంచుకొని తెలంగాణకు ద్రోహం చేసే నీకు నన్ను నిందించే హక్కు ఎక్కడిది? కేసీఆర్ చేస్తున్న మంచి పనులను చూసి, ఓర్వలేక కన్నుల్లో నిప్పులు పోసుకుంటున్న ఈర్ష్యావాదివి నువ్వు! అసలైన తెలంగాణ వాదిని వదలి....గులాంగిరీ చేస్తున్నది నువ్వు! నీలాంటి దగుల్బాజీ తెలంగాణ ద్రోహుల ఆటలు సాగనివ్వని కేసీఆర్ మీకు పక్కలో బల్లెమయ్యేసరికి ... నాలాంటి వాళ్ళపై ప్రతాపం చూపడం...అక్కసు వెళ్ళగ్రక్కడం దండుగ పని. నీకు చేతనైతే కేసీఆర్‍ను ఎదిరించు...నన్ను కాదు! కుక్క బెదిరించి చెప్పు ఎత్తుకుపోయినట్టున్నాయి నీ బెదిరింపులు! కేసీఆర్ తెలంగాణులకు మేలు చేస్తున్నారు. అది చూసి ఓర్వలేకపోతున్నావు నువ్వు! చివరన... తరిమికొడతాం...అంటున్నావుగా...ఆ తరిమికొట్టే వాళ్ళెవరో...వాళ్ళ చిరునామా లేవో...ప్రకటించు...ముందు! పేరు బహిర్గతం చేయలేనివాడు... తరిమి కొడతాట్ట! వింటే ఎవరైనా నవ్విపోతారు...! రెండూ మూసుకొని ఈ బ్లాగులోకి రాకు! ఆగాగు... నీ నోరు నొక్కుతా...స్పాం లోకి! తెలంగాణుల్ని రెచ్చగొడుతున్నాడు...వెధవమాటలతో....

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. తెలంగాణేతర నాయకుల, తెలంగాణ అభివృద్ధి నిరోధకుల మోచేతి కింది నీళ్ళు తాగే నీలాంటి వాళ్ళున్నంత మాత్రాన...కుక్కల్లా మొరిగినంత మాత్రాన...తెలంగాణ బంగారు తెలంగాణ కాకుండా పోతుందా? తాటాకు చప్పుళ్ళకు కుందేళ్ళు బెదురుతాయా? తెలంగాణ వ్యతిరేకులతో పోరాడి తెలంగాణులు వీరులయ్యారు. నీలాంటి పిచ్చికుక్కల్ని తరిమి తరిమికొడతారు...ఇలాగే వెధవ రాతలు రాస్తూ...విషం కక్కుతూంటే....

   తొలగించండి