Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శనివారం, అక్టోబర్ 19, 2013

నిషిద్ధాక్షరి: టవర్గ (ట, ఠ, డ, ఢ, ణ) అక్షరాల నిషేధం...టంగుటూరి ప్రకాశం పంతులు వర్ణన...స్వేచ్ఛాచ్ఛందం...


తేది: జూన్ 28, 2012 నాటి శంకరాభరణంలో నిషిద్ధాక్షరి శీర్షికన టవర్గ (ట,ఠ,డ,ఢ,ణ) అక్షరాలను ఉపయోగించకుండా "టంగుటూరి ప్రకాశం పంతులు" గురించి మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయమనగా నేను రాసిన ఉత్పలమాలా వృత్తము...

పేదరికాన జన్మ, గురువే ఘనదైవము, తల్లి వేదనే
ఖేదము, విద్యలే విజయకేతనముల్, తన దేశభక్తియే
మోదము, దేశసాధనయె ముఖ్యము, దిక్కయె లేనివారి, కే
భేదము లాంధ్రకేసరిగఁ బెద్దను జేసిన వీ ప్రకాశమున్?


(ఆంధ్ర-కేసరిగ, ఆంధ్రకే-సరిగ)

6 కామెంట్‌లు:

  1. మీ బ్లాగును బ్లాగ్ వేదికకు జతచేయండి
    http://blogvedika.blogspot.in/

    రిప్లయితొలగించండి


  2. నిషిద్దాక్షరములని విడచివేసి ప్రకాశం గారిపై మీరు రచించిన పద్యం మీ అన్ని రచనలవలెనే చాలా బాగున్నది.అభినందనలు.

    రిప్లయితొలగించండి