ఓం నమో భగవతే వాసుదేవాయ
శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]
ఏఁబదిరెండవ పద్యము:
చంపకమాల:
ధర సుమనోహరా! మరణ తర్కము కాళియు మల్లరమ్ముగా
నెఱిఁగియు, నో హరీ! మడుఁగు నీఁగియు, నచ్చట మారుతాశితో
దుర మమలోత్తరా! యఱిమి, దుష్టమునౌ మదమార్పి, నృత్యస
ద్వరమిడితే! వెసం బటిమ వర్ధిలఁ దేర్చితె! వ్యక్త! కేశవా! 52
గర్భిత కందము:
సుమనోహరా! మరణ త
ర్కము కాళియు మల్లరమ్ముగా నెఱిఁగియు, నో
యమలోత్తరా! యఱిమి, దు
ష్టమునౌ మదమార్పి, నృత్యసద్వరమిడితే! 52
గర్భిత తేటగీతి:
మరణ తర్కము కాళియు మల్లరమ్ము;
మడుఁగు నీఁగియు, నచ్చట మారుతాశి
నఱిమి, దుష్టమునౌ మదమార్పి, నృత్య
పటిమ వర్ధిలఁ దేర్చితె! వ్యక్త! కేశ! 52
స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు