Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

సోమవారం, జూన్ 14, 2021

ముప్పదిరెండవ పద్యము: శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము [గర్భకవిత్వము]

  ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]


ముప్పదిరెండవ పద్యము:

చంపకమాల:
అభిశపనమ్ముచే నల యహల్య పడెన్ శిలయై వనాన; రా
మ భజన చేకొనం గడచె, మాపులు ఱేపులు; కాంచ నిన్ను, దు
ర్లభ సుపరీక్షయై, తొరలె రామ, పడం బదధూళి యప్డు! మా
న్య! భవహరా! హరీ! ప్రణతు లచ్యుత! యిమ్ము శుభమ్ము! కేశవా! 32

గర్భిత కందము:
శపనమ్ముచే నల యహ
ల్య పడెన్ శిలయై వనాన; రామ భజనచే
సుపరీక్షయై, తొరలె రా
మ, పడం బదధూళి యప్డు! మాన్య! భవహరా! 32

గర్భిత తేటగీతి:
అల యహల్య పడెన్ శిలయై వనానఁ;
గడచె, మాపులు ఱేపులు; కాంచ నిన్నుఁ,
దొరలె రామ, పడం బదధూళి యప్డు!
ప్రణతు లచ్యుత! యిమ్ము శుభమ్ము! కేశ! 32



స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి