ఓం నమో భగవతే వాసుదేవాయ
శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]
నలుఁబదితొమ్మిదవ పద్యము:
చంపకమాల:
మన, రయ మత్తఱి న్నిలను మానియు యాదవు లింద్రపూజ నే
ర్పున, లలి నా దెసం బరఁగ మ్రొక్కిరి గోఽభయ పర్వతమ్ముఁ! గ్రు
మ్మను, హయుఁ డప్డిడన్ జడిని, మాయ యణంగఁగ, శైల మెత్తి, యా
ర్తి నడఁపితే! హరీ! జనులఁ దేర్చితె తుష్టినిఁ జక్రి! కేశవా! 49
గర్భిత కందము:
రయ మత్తఱి న్నిలను మా
నియు యాదవు లింద్రపూజ నేర్పున, లలి నా
హయుఁ డప్డిడన్ జడిని, మా
య యణంగఁగ, శైల మెత్తి, యార్తి నడఁపితే! 49
గర్భిత తేటగీతి:
ఇలను మానియు యాదవు లింద్రపూజఁ,
బరఁగ మ్రొక్కిరి గోఽభయ పర్వతమ్ము!
జడిని మాయ యణంగఁగ, శైల మెత్తి,
జనులఁ దేర్చితె తుష్టినిఁ జక్రి! కేశ! 49
స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి