Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

మంగళవారం, జూన్ 15, 2021

ముప్పదిమూఁడవ పద్యము: శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము [గర్భకవిత్వము]

ఓం నమో భగవతే వాసుదేవాయ

శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]


ముప్పదిమూఁడవ పద్యము:

చంపకమాల:
నిను, ఖలుఁ డజ్ఞుఁడై వదర, నీ వల పౌండ్రకవాసుదేవు నం
తన విఱువన్ హరీ త్వర రణమ్మున బల్మినిఁ దాఁకి, వాని నీ
ఘనదళపమ్ముతో నుఱుమఁగా, నల తేజు నినున్ గమించె న
ల్లన స్మరణన్! నతుల్ మురహరా! గరుడధ్వజ! పూజ్య! కేశవా! 33

గర్భిత కందము:
ఖలుఁ డజ్ఞుఁడై వదర, నీ
వల పౌండ్రకవాసుదేవు నంతన విఱువన్,
దళపమ్ముతో నుఱుమఁగా,
నల తేజు నినున్ గమించె నల్లన స్మరణన్! 33

గర్భిత తేటగీతి:
వదర, నీ వల పౌండ్రకవాసుదేవు,
త్వర రణమ్మున బల్మినిఁ దాఁకి, వాని
నుఱుమఁగా, నల తేజు నినున్ గమించె!
మురహరా! గరుడధ్వజ! పూజ్య! కేశ! 33స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లుకామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి