ఓం నమో భగవతే వాసుదేవాయ
శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]
ఇరువదియేడవ పద్యము:
చంపకమాల:భ్రమఁ గొని ప్రేమనున్ గుహుఁడు, రాముని యంఘ్రులఁ గోరి కడ్గె, మో
దము మెయినిం, "బదిం గణముఁ దాల్చియు, ఱాయియె కాంతయయ్యెఁ! బా
దముఁ జని, యోడపై నునుప, దబ్బున నేమగునో?"యటంచుఁ, బోన్
దమి, వెసఁ దాన్! హరీ! గుహు నెడందనుఁ జేర్పవె కూర్మిఁ గేశవా! 27
గర్భిత కందము:
కొని ప్రేమనున్ గుహుఁడు రా
ముని యంఘ్రులఁ గోరి కడ్గె, మోదము మెయినిం
జని, యోడపై నునుప, ద
బ్బున నేమగునో?"యటంచుఁ, బోన్ దమి, వెసఁ దాన్! 27
గర్భిత తేటగీతి:
గుహుఁడు రాముని యంఘ్రులఁ గోరి కడ్గెఁ,
"గణముఁ దాల్చియు, ఱాయియె కాంతయయ్యె!
నునుప, దబ్బున నేమగునో?"యటంచుఁ!
గుహు నెడందనుఁ జేర్పవె కూర్మిఁ గేశ! 27
స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి