Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శుక్రవారం, జూన్ 11, 2021

ఇరువదితొమ్మిదవ పద్యము: శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము [గర్భకవిత్వము]

 ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]


ఇరువదితొమ్మిదవ పద్యము:

చంపకమాల:
కడు వెత నున్న యా ధ్రువుఁడు గాఢ తపస్సునఁ దోఁగియు న్నటన్
వడిఁ దనుపన్, హరీ! యతని భారముఁ దీర్చియు, నార్తిఁ ద్రుంప, దం
దడి, యతి! వానికిన్ ధ్రువ పద మ్మతి హర్షముతోడ నిత్తె య
య్యెడ వరదా! నతుల్! వడిగ నిట్టులె యిమ్ము శుభమ్ముఁ గేశవా! 29

గర్భిత కందము:
వెత నున్న యా ధ్రువుఁడు గా
ఢ తపస్సునఁ దోఁగియు న్నటన్ వడిఁ దనుపన్,
యతి! వానికిన్ ధ్రువ పద
మ్మతి హర్షముతోడ నిత్తె, యయ్యెడ వరదా! 29

గర్భిత తేటగీతి:
ధ్రువుఁడు గాఢ తపస్సునఁ దోఁగియున్న,
నతని భారముఁ దీర్చియు, నార్తిఁ ద్రుంప,
ధ్రువ పద మ్మతి హర్షముతోడ నిత్తె!
వడిగ నిట్టులె యిమ్ము శుభమ్ముఁ గేశ! 29



స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి