Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

మంగళవారం, జూన్ 01, 2021

ఇరువదిమూఁడవ పద్యము: శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము [గర్భకవిత్వము]

 ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]

ఇరువదిమూఁడవ పద్యము:

చంపకమాల:
వర వసుషేణ! విన్! బరఁగ వాయుసుతుండు సుభక్తుఁడయ్యు, ను
ర్వర సుతకై, హరీ! వెడలి, పార్థివి జాడను వీక్షసేసియున్,
దొర విసు వేదియుం, గపిరథుండు "సెబా" సనఁ, గాంత గుర్తులు
న్విరియ నిడెన్! నినున్ దెలిపి, నీ పదసేవ గడించెఁ! గేశవా! 23

గర్భిత కందము:
వసుషేణ! విన్! బరఁగ వా
యుసుతుండు సుభక్తుఁడయ్యు, నుర్వర సుతకై,
విసు వేదియుం, గపిరథుం
డు "సెబా" సనఁ, గాంత గుర్తులు న్విరియ నిడెన్! 23

గర్భిత తేటగీతి:
పరఁగ వాయుసుతుండు సుభక్తుఁడయ్యు,
వెడలి, పార్థివి జాడను వీక్షసేసి,
కపిరథుండు "సెబా" సనఁ, గాంత గుర్తు
దెలిపి, నీ పదసేవ గడించెఁ! గేశ! 23



స్వస్తి
'మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి