Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

గురువారం, జూన్ 17, 2021

ముప్పదినాలుఁగవ పద్యము: శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము [గర్భకవిత్వము]

ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]


ముప్పదినాలుఁగవ పద్యము:

చంపకమాల:
పెను ద్రుణుఁ డన్న, దా నిల విభీషణు, లంక బహిష్కరింప, స
న్మన మిడియున్, దనన్, బ్రియత మన్పు మనంగను, ప్రేమ మీఱఁగాఁ
గొని ప్రణిపత్తి, నీ వసురకున్, గుణ మెంచి, సమాదరింతె, గొ
బ్బునఁ గరుణన్ హరీ! నతులు భూధవ! చిద్గుణ! నంద! కేశవా! 34

గర్భిత కందము:
ద్రుణుఁ డన్న, దా నిల విభీ
షణు, లంక బహిష్కరింప, సన్మన మిడియుం
బ్రణిపత్తి, నీ వసురకున్,
గుణ మెంచి, సమాదరింతె, గొబ్బునఁ గరుణన్! 34

గర్భిత తేటగీతి:
ఇల విభీషణు, లంక బహిష్కరింపఁ
బ్రియత మన్పు మనంగను, ప్రేమ మీఱ
నసురకున్, గుణ మెంచి, సమాదరింతె!
నతులు భూధవ! చిద్గుణ! నంద! కేశ! 34



స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి