ఓం నమో భగవతే వాసుదేవాయ
శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]
నలుఁబదిరెండవ పద్యము:
చంపకమాల:
చెలి కిడఁ బుష్పమున్, సఖియ సెప్పెడు కొండెము సత్య పూని, పే
రలుక మెయిం గడున్ వెగడ, నచ్యుత! యొప్పియు, వేల్పుఁజెట్టు నీ
విల వడి నెమ్మితో నడుగ, నింద్రుఁ డసమ్మతి, నాజి నోడి, దో
యిలి నిడెగా! హరీ! యగము నిచ్చెఁగదా! యవనారి! కేశవా! 42
గర్భిత కందము:
ఇడఁ బుష్పమున్, సఖియ సె
ప్పెడు కొండెము సత్య పూని, పేరలుక మెయిన్
వడి నెమ్మితో, నడుగ, నిం
ద్రుఁ డసమ్మతి, నాజి నోడి, దోయిలి నిడెగా! 42
గర్భిత తేటగీతి:
సఖియ సెప్పెడు కొండెము సత్య పూని,
వెగడ, నచ్యుత! యొప్పియు, వేల్పుఁజెట్టు
నడుగ, నింద్రుఁ డసమ్మతి, నాజి నోడి,
యగము నిచ్చెఁగదా! యవనారి! కేశ! 42
స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి