ఓం నమో భగవతే వాసుదేవాయ
శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]
నలుఁబదియైదవ పద్యము:
చంపకమాల:
హరవినుతోద్గుణా! యతివయైనను, తాటక నంపఁజంపినన్,
సరసగుణా! ధ్రువా! యసుర జాతు, విభీషణు నాదరించినన్,
హరి! దనుజద్విషా! పసరమైనను, మారుతి భక్తి మెచ్చినన్,
స్థిరకృపయే కదా! జన వశీకర! వెల్గితె చక్రి! కేశవా! 45
గర్భిత కందము:
వినుతోద్గుణా! యతివయై
నను, తాటక నంపఁజంపినన్, సరసగుణా!
దనుజద్విషా! పసరమై
నను, మారుతి భక్తి మెచ్చినన్, స్థిరకృపయే! 45
గర్భిత తేటగీతి:
యతివయైనను, తాటక నంపఁజంపి,
యసుర జాతు, విభీషణు నాదరించి,
పసరమైనను, మారుతి భక్తి మెచ్చి,
జన వశీకర! వెల్గితె చక్రి! కేశ! 45
స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి