ఓం నమో భగవతే వాసుదేవాయ
శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]
ఇరువదియైదవ పద్యము:
చంపకమాల:
"హరి! విను!" మంచు, వే వినమి తాత్మనివేదన భీష్ముఁడిచ్చి, తా
శర శయుఁడై ప్రభూ! యపుడు సర్వము నీ కతఁ డప్పగించియున్,
సరి ఘన దైవమౌ నిను సహస్ర నమమ్ముల నెమ్మిఁ బిల్చె; స
త్పరముఁ గొనెన్ గదా వెసను! తార్క్ష్య! పరాత్పర! విష్ణు! కేశవా! 25
గర్భిత కందము:
విను మంచు, వే వినమి తా
త్మనివేదన భీష్ముఁడిచ్చి, తా శర శయుఁడై
ఘన దైవమౌ నిను సహ
స్ర నమమ్ముల నెమ్మిఁ బిల్చె; సత్పరముఁ గొనెన్! 25
గర్భిత తేటగీతి:
వినమి తాత్మనివేదన భీష్ముఁడిచ్చి,
యపుడు సర్వము నీ కతఁ డప్పగించి,
నిను సహస్ర నమమ్ముల నెమ్మిఁ బిల్చె
వెసను! తార్క్ష్య! పరాత్పర! విష్ణు! కేశ! 25
స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి