Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శనివారం, జూన్ 19, 2021

ముప్పదియాఱవ పద్యము: శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము [గర్భకవిత్వము]

ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]



ముప్పదియాఱవ పద్యము:

చంపకమాల:
భువి జనులున్ సద స్సరయఁ బూజను సల్పఁగ, నడ్డగించి, చా
వ వదరఁగా, హరీ! క్షమను, వంద దొసంగుల సైఁచి, యంత, స
త్స్తవ! కన నందఱున్, వెడఁగు చైద్యునిఁ, జక్రము వేసి, చంపియున్,
శివ మిడితే! యెదన్ వెలుఁగు శ్రీవర! కన్ము సువీక్షఁ గేశవా! 36

గర్భిత కందము:
జనులున్ సద స్సరయఁ బూ
జను సల్పఁగ, నడ్డగించి, చావ వదరఁగాఁ,
గన నందఱున్, వెడఁగు చై
ద్యునిఁ, జక్రము వేసి, చంపియున్, శివ మిడితే! 36

గర్భిత తేటగీతి:
అరయఁ బూజను సల్పఁగ, నడ్డగించి,
క్షమను, వంద దొసంగుల సైఁచి, యంత,
వెడఁగు చైద్యునిఁ, జక్రము వేసి, చంపి,
వెలుఁగు శ్రీవర! కన్ము సువీక్షఁ గేశ! 36



స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి