Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శుక్రవారం, జూన్ 18, 2021

ముప్పదియైదవ పద్యము: శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము [గర్భకవిత్వము]

ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]


ముప్పదియైదవ పద్యము:

చంపకమాల:
వెస ముని శప్తులై మహిఁ గుబేరుని సూనులు, మద్దులయ్యుఁ బ్రో
వ సరవితోఁ గనన్, విడిచి పాఱఁగ శాపము, వేచియుండియున్,
రస జనియించి, నిన్ జనని, గ్రక్కున ఱోటికిఁ జక్కఁగట్టఁ, గూ
ల్చి, సెలఁగితే! యిఁకన్ వెత హరింపఁగఁజేసితె ప్రీతిఁ, గేశవా! 35

గర్భిత కందము:
ముని శప్తులై మహిఁ గుబే
రుని సూనులు, మద్దులయ్యుఁ, బ్రోవ సరవితో
జనియించి, నిన్ జనని, గ్ర
క్కున ఱోటికిఁ జక్కఁగట్టఁ, గూల్చి, సెలఁగితే! 35

గర్భిత తేటగీతి:
మహిఁ గుబేరుని సూనులు, మద్దులయ్యు,
విడిచి పాఱఁగ శాపము, వేచియుండి,
జనని గ్రక్కున ఱోటికిఁ జక్కఁగట్ట,
వెత హరింపఁగఁజేసితె ప్రీతిఁ గేశ! 35



స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి