Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ఆదివారం, జూన్ 20, 2021

ముప్పదియేడవ పద్యము: శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము [గర్భకవిత్వము]

ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]



ముప్పదియేడవ పద్యము:

ఉత్పలమాల:
శ్రీ సురసేవ్యుఁడౌ నభవుచే వరమంది, కొనం బరీక్ష భ
స్మాసురుఁ, డోర్మితో శివు దెసన్ గమియింపఁగఁ, జేర నిన్నుఁ, దో
డై, సిరిగేస్తు! నీ వడఁప నాసురు, మోహినివయ్యుఁ జంపి, జో
డై సనితే! హరీ! నతుల నందియు వెల్గితె! నంద! కేశవా! 37

గర్భిత కందము:
సురసేవ్యుఁడౌ నభవుచే
వరమంది, కొనం బరీక్ష భస్మాసురుఁ; డో
సిరిగేస్తు! నీ వడఁప నా
సురు; మోహినివయ్యుఁ జంపి, జోడై సనితే! 37

గర్భిత తేటగీతి:
నభవుచే వరమంది, కొనం బరీక్ష,
శివు దెసన్ గమియింపఁగఁ, జేర నిన్ను;
నడఁప నాసురు, మోహినివయ్యుఁ జంపి,
నతుల నందియు వెల్గితె! నంద! కేశ! 37



స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి