ఓం నమో భగవతే వాసుదేవాయ
శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]
నలుఁబదియొకటవ పద్యము:
చంపకమాల:
హిత మలరార నా శబరి యెంగిలి పండ్లనుఁ జక్క నీయ, గీ
ము తళుకిడన్, వెసం గొనియు, మోదమునం దిని, కూర్మిఁ జూచి, స
న్మతిఁ బులకింతలుం బ్రబల, మంగళరూప! పరమ్మునిత్తె కాం
క్షిత మొదవన్! హరీ! ప్రణతి సేసెద శ్రీరఘురామ! కేశవా! 41
గర్భిత కందము:
అలరార నా శబరి యెం
గిలి పండ్లనుఁ జక్క నీయ, గీము తళుకిడం,
బులకింతలుం బ్రబల, మం
గళరూప! పరమ్మునిత్తె కాంక్షిత మొదవన్! 41
గర్భిత తేటగీతి:
శబరి యెంగిలి పండ్లనుఁ జక్క నీయఁ,
గొనియు, మోదమునం దిని, కూర్మిఁ జూచి,
ప్రబల! మంగళరూప! పరమ్మునిత్తె!
ప్రణతి సేసెద శ్రీరఘురామ! కేశ! 41
స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి