ఓం నమో భగవతే వాసుదేవాయ
శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]
నలుఁబదియేడవ పద్యము:
చంపకమాల:
హరి! చెవులందునన్ జననమంది, వరోద్ధతి, శక్తిఁ జూపి, ధీ
వర! చెలఁగ, న్మఱిం దఱుమ బ్రహ్మను, ని న్వడిఁ దానుఁ జేర, శ్రీ
వర! భవదూరువన్ క్షమకుఁ బంపు వహి, న్మధుకైటభాంత్యమున్
జరపితివే! శుభ మ్మొసఁగి, సాఁగితివే! పురుహూతి! కేశవా! 47
గర్భిత కందము:
చెవులందునన్ జననమం
ది, వరోద్ధతి, శక్తిఁ జూపి, ధీవర! చెలఁగన్,
భవదూరువన్ క్షమకుఁ బం
పు వహి, న్మధుకైటభాంత్యమున్ జరపితివే! 47
గర్భిత తేటగీతి:
జననమంది, వరోద్ధతి, శక్తిఁ జూపి,
తఱుమ బ్రహ్మను, ని న్వడిఁ దానుఁ జేర,
క్షమకుఁ బంపు వహి, న్మధుకైటభాంత్య
మొసఁగి, సాఁగితివే! పురుహూతి! కేశ! 47
స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి