Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శనివారం, జూన్ 05, 2021

ఇరువదియెనిమిదవ పద్యము: శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము [గర్భకవిత్వము]

 ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]

ఇరువదియెనిమిదవ పద్యము:

చంపకమాల:
ననుపిదె! భక్తిచేఁ బరఁగ నారదుఁడే తన పూర్వపుణ్య ప్రా
ప్తిని స్మరణన్ భళా! ద్రుతగతిం గని భక్తిఁ, ద్రిలోకగామి, ప్రా
పునుఁ గొనియున్ హరీ! మిగులఁ బోన్, ద్రిదివమ్ములు మేల్మినొందెఁ; దె
ల్విని వెలిఁగెన్! వెసన్ వఱల, శ్రీధర! మా కిడు భక్తిఁ గేశవా! 28

గర్భిత కందము:
ఇదె భక్తిచేఁ బరఁగ నా
రదుఁడే తన పూర్వపుణ్య ప్రాప్తిని స్మరణన్
గొనియున్ హరీ! మిగులఁ బోన్,
ద్రిదివమ్ములు మేల్మినొందెఁ; దెల్విని వెలిఁగెన్! 28

గర్భిత తేటగీతి:
పరఁగ నారదుఁడే తన పూర్వపుణ్య
ద్రుతగతిం గని భక్తిఁ, ద్రిలోకగామి,
మిగులఁ బోన్, ద్రిదివమ్ములు మేల్మినొందె!
వఱల, శ్రీధర! మా కిడు భక్తిఁ గేశ! 28



స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి