నిషిద్ధాక్షరి శీర్షికన ఈయబడిన
ఓష్ఠ్యాక్షర (ప, ఫ, బ, భ, మ) నిషేధముతో
మద్యపానాన్ని మానుమని హితబోధ చేస్తూ
నచ్చిన ఛందంలో పద్యం వ్రాయమనగా
నేను రాసిన రెండు కందపద్యాలు.
సుర సేవించుట హానియ
నరులకు నద్దాని విడువనౌ వేగముగన్
ద్వరిత విదూర రహితుఁడగు
సురాసువును మెచ్చఁ డెవఁడు క్షోణితలానన్!
(౨)
శీధు గ్రహణ వ్యసనుఁడు
సాధువగునె? దుర్జన సృతి సంచారియగున్!
శోధనతో విడువ వలయు
శీధువు సేవించుటెల్ల శీఘ్రగతినిఁ దా!
(దంత్యోష్ఠ్యమగు "వ"కారము నిషేధింపమి నిందు స్వేచ్ఛగఁ బ్రయోగింపఁబడినది)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి