తేది: సెప్టెంబర్ 12, 2014 నాటి శంకరాభరణంలోని దత్తపది శీర్షికన ఈయబడిన
చింత-నిమ్మ-మామిడి-వెలగ పదాలను ఉపయోగిస్తూ
ద్రౌపది కీచకుని అధిక్షేపించడాన్ని
మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయమనగా
నేను రాసిన సీసపద్యము
(ద్రౌపది కీచకునితో పలికిన పలుకులు)
||సీ||
"అన్యకాంతలఁ గోరు ♦ టధమ కృత్యము గాన,
ననుఁ గోరునట్టి చిం ♦ త నిఁక మాని,
నా కడ్డముగ రాక, ♦ నన్నుఁ బోనిమ్మన,
నడ్డుపడక వీడు ♦ మయ్య వేగ;
వేదించకయ నీవు ♦ విడువుమా మిడిమిడి
జ్ఞానమ్ము నిప్పుడు ♦ సభ్యతఁ గని,
దివ్వెలగమి వెల్గు ♦ దీపించు నట్టుల
సచ్చరితుండవై ♦ శాంతిఁ గనుము!
||గీ||
లేనిచో నిన్ను నా పతు ♦ లే నిహతునిఁ
జేసి, నీ తృష్ణ నడుగంటఁ ♦ గోసి, మఱల
నే యధముఁడిట్లు దుశ్చేష్టఁ ♦ జేయకుండఁ
దగు సమాధాన మిత్తురు ♦ తగ విదియని!!"
లేనిచో నిన్ను నా పతు ♦ లే నిహతునిఁ
జేసి, నీ తృష్ణ నడుగంటఁ ♦ గోసి, మఱల
నే యధముఁడిట్లు దుశ్చేష్టఁ ♦ జేయకుండఁ
దగు సమాధాన మిత్తురు ♦ తగ విదియని!!"
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి