Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

మంగళవారం, సెప్టెంబర్ 23, 2014

పద్యరచన: మాయూరు...ఓరుఁగల్లు

తేది: సెప్టెంబర్ 14, 2014 నాటి శంకరాభరణంలోని పద్యరచన శీర్షికన ఈయబడిన "మా యూరు"ను గూర్చి నేను రాసిన సీసపద్యము


మా యూరి నోరుఁగంటినిఁ దలఁచినకొలఁది మది పులకించును

||సీ||
కాకతీయుల యోరుఁ  గల్లున గతవైభ
వపుఁ జిహ్నములు నిల్పు  భావనలను;
నట స్వయంభూదేవు  నాలయమందున
దీపించు శివలింగ  దీధితులను;
దొడరి వేస్తంభాల  గుడిలోన వెలసిన
పరమేశ్వరకృపా ప్ర ♦ భాతములను;
గుట్టపైఁ బద్మాక్షి  గురుతరాశీఃప్రద
వీక్షణమ్ములొసంగు  ప్రేరణలను;
||గీ||
భద్రకాళియొసఁగు  పావనాశీఃపూత
మౌ సరోవరజల  మాధురులను;
పరమ పదముఁ జేర్చు  వరద గోవిందుని
యభయముద్ర యిచ్చి  యాదరించు!!
 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి