తేది: సెప్టెంబర్ 16, 2014 నాటి శంకరాభరణంలో
న్యస్తాక్షరి శీర్షికన ఈయబడిన
అంశం - నగర జీవనము
ఛందస్సు - కందము
మొదటిపాదం, మొదటి అక్షరం ‘న’,
రెండవపాదం, రెండవ అక్షరం ‘గ’,
మూడవ పాదం, మూడవ అక్షరం ‘ర’,
నాల్గవ పాదం, నాల్గవ అక్షరం ‘ము’
నగరమునఁ గృత్రిమత్వ
మ్మగపడు నెటఁజూడఁ జనవు మానవబంధా
లొగి రవరవలం గనఁ జా
టుగఁ గుములుచు బయటికిఁ బొగడుదురయ మిగులన్!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి