తేది: సెప్టెంబర్ 17, 2014 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము
(పింగళి సూరన కళాపూర్ణోదయకథలో బ్రహ్మసరస్వతుల సరస సంభాషణ నిచ్చట ననుసంధానించుకొనునది)
రెండు జన్మాల కథల విరించి చెప్ప;
వాణి తమదు ప్రణయకథా వర్ణనమనె!
వాణికిఁ దెలివి లేదని బ్రహ్మ పలికె;
బ్రహ్మ వివరణమును విని వాణి నవ్వె!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి