Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

బుధవారం, సెప్టెంబర్ 03, 2014

దత్తపది: దెస-నస-పస-వెస (స్వార్థాన్ని విడచి)...స్వేచ్ఛా ఛందం...రామాయణార్థం

తేది: ఆగస్టు 25, 2014 నాటి శంకరాభరణంలోని దత్తపది శీర్షికన ఈయబడిన
దెస-నస-పస-వెస పదాల స్వార్థాన్ని విడచి
స్వేచ్ఛాఛందంలో
రామాయణార్థంలో
పద్యం రాయమనగా
నేను రాసిన రెండు పద్యాలు౧. శ్రీరాముఁడు శివధనువుం ద్రుంచిన తఱి నిద్దఱు స్త్రీలు సంభాషించుకొను సందర్భము...ప్రజకు సంతోష మిదె సత్వరముగఁ గూర్చె;
శంకరుని విల్లుఁ ద్రుంచిన సత్వఘనుఁడు
జానకిన్ వెఱఁగుపఱుప సరభసముగఁ
గరము గ్రహియించె నటఁజూవె సరసిజాక్షి!


***        ***        ***౨. రావణుని దురాగతము...కాదె సకలమహితము? లంకాధిపుండు
భూజ నసమంజసమ్ముగా మ్రుచ్చిలించి
తన యశోకవనమ్మున సదనుజ కృత
బంధితనుఁ జేసెఁ జూవె సద్బ్రహ్మకులుఁడు!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి