తేది: సెప్టెంబర్ 05, 2014 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము
(ప్రహ్లాదకుమారునకుం గల హరిభక్తిని మాన్పించుటకు నిరంతరము యత్నించుచున్న గురులపైఁ దిరస్కారభావముతో నతని స్నేహితులు చేసిన దుడుకు చేష్ట యంగీకృతమేయని సమర్థించు సందర్భము)
గురువులు చండమర్కులకుఁ గూరిమి విష్ణుని నామమెన్నఁగన్ని
రసనయుంట నోర్చకయ నేర్పున శిష్యులు పంగనామముల్
హరిని స్మరించి దిద్దిరి!! యహమ్మును గల్గినయట్టి మూర్ఖుఁడౌ
గురునకుఁ బంగనామముల గుట్టుగఁ బెట్టెడి శిష్యు లుత్తముల్!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి