Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

సోమవారం, సెప్టెంబర్ 29, 2014

దత్తపది: అల-కల-తల-వల...రావణుని చెరలో సీత మనోగతం...స్వేచ్ఛాచ్ఛందము...

తేది: సెప్టెంబర్ 18, 2014 నాటి శంకరాభరణంలోని దత్తపది శీర్షికన ఈయబడిన
అల-కల-తల-వల పదములనుపయోగించి
రావణుని చెరలో సీత మనోగతాన్ని తెలుపుతూ
స్వేచ్ఛాచ్ఛందమున పద్యం రాయమనగా
నేను రాసిన సీసపద్యము


(అశోకవనమున రాక్షసస్త్రీల నడుమఁ జెఱలోనుండి శ్రీరామునిఁ దలఁచుకొనుచు సీత విలపించు సందర్భము)

॥సీ॥
అలరారు నడలతో ♦ నలరు బంగరు జింకఁ 
గోరఁగ, నీ వేగ, ♦ నలవికాని
కల మాయలఁ గ్రమ్మి, ♦ సరగున నిఁక లం
కునుఁ దెచ్చి, కలఁగించెఁ ♦ గూటవృత్తుఁ
డగు పదితలల దుం ♦ డగుఁడు, దుశ్చింతల
వంతల నిడె నాకు ♦ బలిమితోడఁ;
జావవలచియుంటి ♦ సత్వర మ్మీవిట
నడుగిడకున్న, దా ♦ నవల వలన!

॥గీ॥
నలవి కానట్టి చెఱను నే ♦ ననుభవించు
చుంటి; వికలమాయెను హృది; ♦ శోభ తలఁగెఁ;
దలఁపులో నిన్ను నిలిపితి; ♦ దనుజుఁ జంపి,
త్వరగ ననుఁ జెఱనుండి యీ ♦ వలకుఁ దెమ్ము!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి