Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

మంగళవారం, సెప్టెంబర్ 16, 2014

న్యస్తాక్షరి: ప్రతి పాదాద్యక్షరాలు వరుసగా ప్ర-వ-రు-డు...తేటగీతిలో...ప్రవరుడు పాదలేపము కొఱకు సిద్ధుని వేడుకొనుటను వర్ణించాలి

తేది: సెప్టెంబర్ 10, 2014 నాటి శంకరాభరణంలోని న్యస్తాక్షరి శీర్షికన ఈయబడిన 
అంశం- ప్రవరుఁడు పాదలేపము కొఱకు సిద్ధుని వేడుకొనుట
ఛందస్సు- తేటగీతి
నాలుగు పాదాలలో మొదటి అక్షరాలు వరుసగా ప్ర-వ-రు-డు ఉండాలనగా
నేను రాసిన పద్యముప్రవరుఁ డిటు వేడె సిద్ధునిఁ "బరమపురుష!
రయుతౌషధసిద్ధ! సత్పథగ! ఘన! క
రుణనుఁ బాదలేపమ్మునుం ద్రుతము నొసఁగుఁ
డు! ననుఁ దీర్థయాత్రాచరుఁ డుగనుఁ గనుఁడు!"

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి