కందములు:
ఘన కాకతీయ కాల
మ్మునఁ దిరమగు నోరుఁగంటి పురిఁ బాల్కుఱికిన్
జననమ్ము నంది తా వెలిఁ
గెను సోమన సకల శాస్త్ర గీ రధికృతుఁడై!
గెను సోమన సకల శాస్త్ర గీ రధికృతుఁడై!
వారని శివ భక్తియు దై
వాఱంగను శైవదీక్షఁ బఱఁగం గొనియున్
వాఱంగను శైవదీక్షఁ బఱఁగం గొనియున్
వీరమహేశ్వర వ్రతుఁడై
ధీరత వినుతించె నభవుఁ దిరముగఁ దానున్!
ధీరత వినుతించె నభవుఁ దిరముగఁ దానున్!
తెలుఁగుం గన్నడ సంస్కృత
ముల నధికారమునఁ గావ్యములను రచింపన్
ముల నధికారమునఁ గావ్యములను రచింపన్
బులకించె జనుల హృదులునుఁ
దులకించెను సోమనాథుఁడును లోకమునన్!
దులకించెను సోమనాథుఁడును లోకమునన్!
శివకవి యుగమ్ము నందునఁ
గవి పాల్కుఱికియె ముదమునఁ గావ్య రచనమున్
గవి పాల్కుఱికియె ముదమునఁ గావ్య రచనమున్
బ్రవిమల కాంతులఁ జిమ్మఁగ
సువిదితముగఁ జేసెఁ గవులు చోద్యము నందన్!
సువిదితముగఁ జేసెఁ గవులు చోద్యము నందన్!
కమనీయ వీర శైవయు
తము బసవపురాణ పండితారాధ్యచరి
తము బసవపురాణ పండితారాధ్యచరి
త్రముల విరచించి జనులకు
నమల ద్విపదాఖ్య పద్యహారముల నిడెన్!
అనుభవసారము నెల్లను
ననుభవసార మను పేర నతుల సుకావ్య
ననుభవసార మను పేర నతుల సుకావ్య
మ్మును రచియించియుఁ బ్రజ కిడి
తన జన్మ వెలుంగు లీనఁ దనియించె ధరన్!
తన జన్మ వెలుంగు లీనఁ దనియించె ధరన్!
పలుకావ్యాల్ విరచించియుఁ
దెలుఁగుల కందించి జనుల తిరమగు పలుకుల్
దెలుఁగుల కందించి జనుల తిరమగు పలుకుల్
విలువైన రీతిఁ బ్రసరణ
ముల వెలయించియు వెలింగె ముదమునఁ దానున్!
ముల వెలయించియు వెలింగె ముదమునఁ దానున్!
శివభక్తుల కథ లెల్ల న
భవు కృపచేఁ దాను నెఱుక పఱచి జనులకున్
భవు కృపచేఁ దాను నెఱుక పఱచి జనులకున్
శివ మహిమలఁ జూపించెను
నవనీత మనోజ్ఞ హృద్జ్ఞ నవ్యపథమునన్!
నవనీత మనోజ్ఞ హృద్జ్ఞ నవ్యపథమునన్!
శ్రీ వీరశైవ భూసుర
కైవార ప్రకట నిగమ గమ్యవిదుండై
కైవార ప్రకట నిగమ గమ్యవిదుండై
యా వీరశైవ ఘనుఁడే
దైవారాధననుఁ గృతులఁ దరియింప నిడెన్!
దైవారాధననుఁ గృతులఁ దరియింప నిడెన్!
ఆ మహనీయుని కెనయగు
నే మహనీయుఁడును లేఁడు నిక్కముగ భువిన్
నే మహనీయుఁడును లేఁడు నిక్కముగ భువిన్
సామాన్యుఁడు కాఁ డాతం
డా మాన్యున కంజలింతు ననిశము నేనున్!
డా మాన్యున కంజలింతు ననిశము నేనున్!
స్వస్తి
Hello, nice blog keep blogging
రిప్లయితొలగించండిam from wgl
ధన్యవాదాలండీ!
తొలగించండిధన్యవాదాలు
రిప్లయితొలగించండినమోన్నమః
తొలగించండిమధుర కవి గారూ! మీ కున్న శబ్దాధికారం అసమానం. ప్రతి పద్యం లోనూ మీ చిహ్నం (మార్కు) కనిపిస్తోంది.
రిప్లయితొలగించండిధన్యవాదాలండీ సీవీ గారూ!
తొలగించండిమీకు సోమనాథ కళా పీఠం పక్షాన అభినందనలు! నమః!
రిప్లయితొలగించండిధన్యవాదాలండీ!
తొలగించండిఅభినందనలు
రిప్లయితొలగించండిధన్యవాదాలండీ!
తొలగించండిపద్యం మూడవ నాలుగవ పాదంలో యతి భంగమైనది గురుదేవా
రిప్లయితొలగించండిసందీప్ గారూ! ద-డలకు అభేదయతి వేశాను.
తొలగించండిమధుర కవిగారూ! గీరధికృతుడు, హృద్జ్ఞ లాంటి పదాలు శబ్దాధికారం గల మీకే చెల్లు. అభినందనలు.
రిప్లయితొలగించండినాపైఁ గల మీ యభిమానమునకుఁ గడుంగడుఁ గృతజ్ఞుఁడనండీ సీవీ గారూ! ధన్యవాదములు!
తొలగించండిఎంతో గొప్పగా, చాలా మధురంగా రాశారు మధుసూదన్ గారు. మీరన్నట్టు సోమన కవిని మించిన కవి ఇంతవరకూ పుట్టలేడు. అచ్చతెలుగు భాషలో అదీ తీయని తెలంగాణా పలుకులతో ఎన్నో రచనలు చేశాడు. బహుబాషలలో ధిట్ట. సంస్కృతంలోనూ అసామాన్యమైన ప్రతిభ కలవాడు. గంగా ప్రవాహంలా సాగుతుంది వారి రచన, అంత గొప్పగా రాయటం మామూలు విషయం కాదు అంతేకాదు అన్ని రకాల కళల గురించి చర్చిస్తాడు, అన్ని వేద వేదాంగ పురాణేతిహాసాల అలవోకగా తన రచనలో ఇముడుస్తాడు. ఆయన గురించి ఎంత రాసినా తక్కువే. మీకు ఆ పరమేశ్వరుని ఆశీస్సులు సదా ఉండాలని కోరుకుంటున్నాను.
రిప్లయితొలగించండిమీ అభిమాన పూర్వక స్పందనకు ఎంతో కృతజ్ఞుడనండీ స్వామి గారూ!
తొలగించండి