ఓం నమో భగవతే వాసుదేవాయ
శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]
తొంబదియైదవ పద్యము:
చంపకమాల:
తత ఘన! గోదయే తలనుఁ దాల్చిన మాలను దైవపూజఁ జే
ర్చి, తనరఁగా, వెసం గనియు, జియ్యయె తప్పనఁ; "గ్రమ్మఱంగఁ ద
ద్వ్రత, తనుఁ దాల్చి, నా కిడిన దండనె తాల్చెద నే" నటంచుఁ, దా
ల్చితె సతమున్! హరీ! రమణి చిత్తముఁ దేర్చితె శ్లాఘ్య! కేశవా! 95
గర్భిత కందము:
ఘన! గోదయే తలనుఁ దా
ల్చిన మాలను దైవపూజఁ జేర్చి, తనరఁగాఁ,
"దనుఁ దాల్చి, నా కిడిన దం
డనె తాల్చెద నే" నటంచుఁ, దాల్చితె సతమున్! 95
గర్భిత తేటగీతి:
తలనుఁ దాల్చిన మాలను దైవపూజఁ
గనియు, జియ్యయె తప్పనఁ; "గ్రమ్మఱంగ
నిడిన దండనె తాల్చెద నే" నటంచుఁ,
రమణి చిత్తముఁ దేర్చితె శ్లాఘ్య! కేశ! 95
స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి