ఓం నమో భగవతే వాసుదేవాయ
శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]
తొంబదిమూఁడవ పద్యము:
చంపకమాల:
కన, వనమాలి! నీ వలరఁ, గ్రక్కన నీ కృతు లన్నమయ్య క
మ్ర నుతులతో, హరీ! యెసఁగ వ్రాసియు, నంకిత మిచ్చి నీకు గొ
బ్బున ఘనమోదముం జెలఁగి పూన్చిన, మెచ్చితె! శ్రీనివాస! చి
ద్వన మిడితే, భువిన్ స్థిర విభాసిత కీర్తులఁ దేర్చి, కేశవా! 93
గర్భిత కందము:
వనమాలి! నీ వలరఁ, గ్ర
క్కన నీ కృతు లన్నమయ్య కమ్ర నుతులతో,
ఘనమోదముం జెలఁగి పూ
న్చిన, మెచ్చితె! శ్రీనివాస! చిద్వన మిడితే! 93
గర్భిత తేటగీతి:
అలరఁ, గ్రక్కన నీ కృతు లన్నమయ్య
యెసఁగ వ్రాసియు, నంకిత మిచ్చి నీకుఁ
జెలఁగి పూన్చిన, మెచ్చితె! శ్రీనివాస!
స్థిర విభాసిత కీర్తులఁ దేర్చి, కేశ! 93
స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి